NRPT: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ చాంపియన్షిప్ నిర్వహించారు. ఆదివారం రిటైర్ పీఈటీ ఆంజనేయులు జెండా ఊపి పరుగు పందెం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండే క్రీడల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈనెల 11,12న ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి రమణ తెలిపారు.