హుస్నాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో వల్ల ఇతర జిల్లాలకు బదిలీలు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పలుమార్లు అధికారులను కలిసినా పరిష్కారం లభించలేదని తెలిపారు.