MDK: బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.