NRPT: జిల్లా ఓబీసీ అధ్యక్షుడు వాగుల్దాస్ నిరంజన్ గౌడ్, ఆదివారం కల్వకుర్తిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ నాయకత్వంలో మరిన్ని ప్రజాసేవలు అందాలని, తెలంగాణలోని ఓబీసీ సామాజిక వర్గాల అభివృద్ధికి ఆయన కృషి కొనసాగాలని ఆకాంక్షించారు.