AKP: మునగపాక తహసిల్దార్‌గా పీవీ రత్నం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పి. సత్యనారాయణ రాంబిల్లి తహసీల్దారుగా డిప్యూటేషన్ పై వెళ్లారు. ఈయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన రత్నం మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలపై నేరుగా తనను సంప్రదించవచ్చని అన్నారు.