NLG: ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే మంచిది. తప్పనిసరి అయితే గొడుగు, టోపీ వాడాలి. డీహైడ్రేషన్ కాకుండా నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.