ADB: ప్రజలకు ఇసుక రవాణా సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం బోరజ్ MRO కార్యాలయంలో ‘మన ఇసుక వాహనం’ వెబ్, మొబైల్ అప్లికేషన్ను కలెక్టర్ రాజర్షి షా అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లాగిన్ విధానం, సేవల వినియోగంపై అధికారులకు మార్గదర్శకాలు అందజేశారు.