MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో ఉన్న ఇరిగేషన్ కెనాల్లో పేరుకుపోయిన మట్టిని జేసీబీ సహాయంతో తీసివేయించారు. ఆ కెనాల్ ద్వారా రైతుల పొలాలకు సాగునీరు అందుతుంది. అయితే మట్టి పూడుకుపోవడంతో సాగునీరు రావడంలేదని స్థానిక రైతులు కౌన్సిలర్ బోడ రాజు దృష్టికి తీసుకువచ్చారు. ఆదివారం ఇరిగేషన్ కెనాల్లో పేరుకుపోయిన మట్టిని జేసీబీ సహాయంతో తొలగించారు.