TPT: పేరూరు చెరువు నుంచి అవిలాల చెరువు వరకు సప్లై ఛానల్‌కు సంబంధించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పనులకు రూ. 8 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచి, అవిలాల చెరువు సుందరీకరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టాలని అధికారులకు సూచించారు.