ASR: గిరిజన యువతి దూసరి లక్ష్మి ఆత్మహత్య ఘటనపై అనంతగిరి మండలంలో కోరపర్తిలో గ్రామస్తులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రేమ పేరుతో మోసం చేసిన కొల్లి లోకేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం కల్పించాలని కోరారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితుడిని శిక్షించాలని కోరారు.