కోనసీమ: బీజేపీ ప్రశిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు సూచించారు. అయినవిల్లి మండల బీజేపీ సమావేశం శుక్రవారం ముక్తేశ్వరంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో త్వరలో కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.