WGL: రాయపర్తి మండల కేంద్రంలోని 9వ వార్డు గుబ్బడితండాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి శుక్రవారం కొత్త బోరు వేయించారు. కొంతకాలంగా తాగునీటి ఎద్దడి కారణంగా గ్రామస్థులు ఇబ్బందులు పడుతూ దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. బోరు అందుబాటులోకి రావడంతో సమస్య తీరనుందని గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.