• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

IPL: RR కోచ్‌కు వైభవ్ సూర్యవంశీ భరోసా

RR యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మే 19న LSGతో జరిగిన మ్యాచ్‌లో, వరుస ఓటములతో టెన్షన్‌లో ఉన్న కోచ్ కుమార సంగక్కరకు “టెన్షన్‌ వద్దు.. నేనున్నాగా” అంటూ ఈ చిన్నోడు భరోసా ఇచ్చాడు. అన్నట్టుగానే అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించడంతో సంగక్కర క్లిష్ట సమయంలో అతడు చూపిన ధైర్యాన్ని మెచ్చుకున్నాడు.

May 22, 2026 / 12:10 PM IST

‘రో-కోలు ఫిట్‌నెస్‌గా ఉన్నంత కాలం ఆడాలి’

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్, కోహ్లీ (రో-కో) ఫిట్‌నెస్‌గా ఉన్నంత కాలం వన్డేలు ఆడాలని మాజీ క్రికెటర్ కిరణ్ మోరే అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి ఆటను తాను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తానని, ప్రస్తుతం వారి రిటైర్మెంట్‌ గురించి చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అలాగే, యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీతో భవిష్యత్తులో భారత క్రికెట్‌కు మరింత కీర్తి లభిస్తుందన్నాడు.

May 22, 2026 / 11:54 AM IST

ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగింది: గైక్వాడ్

GTతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ‘GT అద్భుత ప్రదర్శనతో మమ్మల్ని చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మా కంటే మెరుగైన ప్రదర్శన చేశారు. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం సులువు కాదు. వారి ఓపెనర్లను కట్టడి చేయలేకపోయాం. టోర్నీ ప్రారంభంలోనే వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగింది’ అని అన్నాడు.

May 22, 2026 / 08:33 AM IST

ఆ ప్లాన్‌తోనే సంజూను ఔట్ చేశా: సిరాజ్

CSKతో జరిగిన మ్యాచ్‌లో విజయం అనంతరం GT బౌలర్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రాక్టీస్ సమయంలో.. నేను నా రిథమ్‌ను మెరుగుపరుచుకోవడానికి కొత్త బంతితో బౌలింగ్ చేస్తా. తర్వాత యార్కర్ల కోసం ప్రయత్నిస్తా. ఇది ఎర్రమట్టి పిచ్ కాబట్టి బ్యాటర్లు కవర్స్ దిశగా షాట్లు ఆడేలా బంతులు వేశా. సంజూ శాంసన్ వికెట్ విషయంలో నేను అనుకున్న ఈ ప్లాన్ వర్కవుట్ అయింది’ అని చెప్పుకొచ్చాడు.

May 22, 2026 / 07:24 AM IST

టాప్-2 స్థానం.. నేడే కీలక పోరు

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో టాప్-2 బెర్త్ కోసం హైదరాబాద్‌లో SRH, RCB మధ్య ఇవాళ ఉత్కంఠ పోరు జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు క్వాలిఫై అయినా, ఫైనల్‌కు చేరేందుకు రెండో అవకాశం ఇచ్చే టాప్-2 స్థానం కోసం ఈ మ్యాచ్ కీలకం. ప్రస్తుతం 18 పాయింట్లతో RCB అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ క్వాలిఫయర్ 1లో చోటు దక్కించుకోగా, RCBని ఓడిస్తేనే SRHకు టాప్-2 దక్కే అవకాశం ఉంది.

May 22, 2026 / 06:25 AM IST

 ‘రో-కో’లపై పాటింగ్ కీలక వ్యాఖ్యలు

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్‌కు తప్పకుండా ఎంపిక చేయాలని కోరాడు. కోహ్లీ ఆట తీరు, రోహిత్ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. కాగా, జూన్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు వీరిద్దరూ ఎంపికయ్యారు.

May 22, 2026 / 12:29 AM IST

GT దెబ్బకు IPL టోర్నీ నుంచి CSK ప్యాకప్

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ప్లేఆఫ్స్ చేరాల్సిన కీలక మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో 89 పరుగుల తేడాతో CSK ఘోర పరాజయం పాలైంది. 230 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో GT బౌలర్లు సిరాజ్, రషీద్ తలో 3 వికెట్లతో చెన్నైని కోలుకోలేని దెబ్బతీశారు. దూబే(47) ఒంటరి పోరాటం చేసినా.. CSK 140 పరుగులకే ఆలౌటై టోర్నీ నుంచి వెనుదిరిగింది.

May 21, 2026 / 11:28 PM IST

 BREAKING: గుజరాత్ భారీ స్కోర్

CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో GT బ్యాటర్లు చెలరేగిపోయారు. సాయి సుదర్శన్ (84) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. కెప్టెన్ గిల్ (64) మెరుపు హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో జోస్ బట్లర్ (57*) అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో GT 229/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. మరి 230 పరుగుల భారీ లక్ష్యాన్ని CSK ఛేజ్ చేస్తుందా..? కామెంట్ చేయండి.

May 21, 2026 / 09:27 PM IST

GT vs CSK: సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ

IPL 2026లో CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో GT ఓపెనర్ సాయి సుదర్శన్ CSK బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుదర్శన్‌కు ఈ సీజన్‌లో ఇది వరుసగా 7వ అర్ధశతకం కావడం విశేషం. ప్రస్తుతం గుజరాత్ జట్టు వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లకు 120 పరుగులతో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.

May 21, 2026 / 08:35 PM IST

GT vs CSK: గిల్ మెరుపు హాఫ్ సెంచరీ

IPL 2026లో CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో GT ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్‌కు ఈ సీజన్‌లో ఇది ఆరో అర్ధశతకం. ప్రస్తుతం గుజరాత్ 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 81 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది.

May 21, 2026 / 08:14 PM IST

అదరగొడుతున్న GT ఓపెనర్లు

CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో GT ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ అదరగొడుతున్నారు. పవర్ ప్లే వీరు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  8 ఫోర్లు, 1 సిక్సర్‌తో పవర్ ప్లే ముగించారు.  వీరి దూకుడైన బ్యాటింగ్‌తో గుజరాత్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది

May 21, 2026 / 08:02 PM IST

GT Vs CSK: తుది జట్లు ఇవే

CSK: సంజు శాంసన్ (WK), రుతురాజ్ గైక్వాడ్ (c), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్. GT: శుభమన్ గిల్ (c), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్

May 21, 2026 / 07:13 PM IST

కోహ్లీకి సవాల్ విసిరిన మన్‌ప్రీత్ సింగ్

హాకీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విరాట్ కోహ్లీ చేసిన ప్రశంసలకు టీమిండియా హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్ ధన్యవాదాలు తెలిపాడు. RCB ఆటగాళ్లతో కలిసి ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనాలని ఉందంటూ ‘యో యో’ టెస్టుకు సరదాగా సవాల్ విసిరాడు. క్రికెట్ కూడా క్లిష్టమైన గేమేనని, తమతో ఫిట్‌నెస్ టెస్టులో పోటీ పడటానికి క్రికెటర్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నాడు.

May 21, 2026 / 05:45 PM IST

CSK ఆటగాళ్లను హెచ్చరించిన రషీద్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ కీలక పోరు నేపథ్యంలో గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి నోట్స్, వ్యూహాత్మక పత్రాలను ఉపయోగించవద్దంటూ CSK ఆటగాళ్లను ఆయన సరదాగా హెచ్చరించాడు.

May 21, 2026 / 05:40 PM IST

బాడీ షేమింగ్ పోస్ట్‌లు.. సారా టెండూల్కర్ ఆగ్రహం

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ ఓ ఫొటోగ్రాఫర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సారా, ఆమె మరదలు సానియా ఎయిర్‌పోర్టుకు వస్తున్న వీడియోను ముంబైకి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ షేర్ చేశాడు. ఆ వీడియోకు అభ్యంతర వ్యాఖ్య జోడించడంతో సారా తీవ్రంగా స్పందించింది. ‘మీరు అసహ్యంగా ఉన్నారు. ఇది జర్నలిజం కాదు. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి’ అని మండిపడింది.

May 21, 2026 / 05:26 PM IST