• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఇండియా-A జట్టులోకి అనుకుల్‌ రాయ్‌

శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టులోకి ఆల్‌రౌండర్ అనుకుల్‌ రాయ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే సిరీస్ కోసం భారత సీనియర్ జట్టుకు హర్ష్‌ దుబే తొలిసారి ఎంపికవడంతో.. అతని స్థానంలో అనుకుల్‌ను ఎంపిక చేశారు. ఈ మెగా సిరీస్ జూన్ 9 నుంచి దంబుల్లాలో ప్రారంభం కానుంది.

May 21, 2026 / 02:29 PM IST

IPL 2026: PBKS, KKR మధ్య తేడా ఇదే..!!

ఈ ఏడాది IPLలో తొలి ఆరు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా PBKS పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో KKR తొలి ఆరు మ్యాచ్‌లలో గెలుపు లేకుండా 10వ స్థానంలో ఉంది. ఆ తర్వాత PBKS వరుసగా 6 మ్యాచ్‌లలో ఓడి ఐదో స్థానానికి పరిమితం కాగా.. KKR చివరి 7 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లు గెలిచి ఆరో స్థానానికి చేరి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

May 21, 2026 / 12:08 PM IST

కోడ్‌ ఉల్లంఘన.. హార్దిక్‌ పాండ్యాకు జరిమానా

KKRతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన MIకు మరో బిగ్ షాక్ తగిలింది. ముంబై బౌలింగ్ చేస్తున్న సమయంలో ప్రవర్తనా నియమావళిని కెప్టెన్‌ హార్దిక్ ఉల్లంఘించాడు. 10వ ఓవర్‌లో బౌలింగ్ రన్-అప్‌కు వెళ్తూ కోపంతో వికెట్ బెయిల్స్‌ను పాండ్యా పడగొట్టాడు. దీంతో మ్యాచ్‌ ఫీజులో 10శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌‌ను BCCI విధించింది.

May 21, 2026 / 11:11 AM IST

ముంబై ఇండియన్స్ పేరిట చెత్త రికార్డు

IPL చరిత్రలోనే అరుదైన చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. వరుసగా 3 మ్యాచ్‌ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగిన రెండో జట్టుగా ముంబై నిలిచింది. సూర్యకుమార్, బుమ్రా, పాండ్యా వరుసగా నాయకత్వం వహించారు. కాగా ఈ జాబితాలో గతంలో పుణే వారియర్స్ ఇండియా మాత్రమే ఉంది. రాస్ టేలర్, ఏంజెలో మాథ్యూస్, ఆరోన్ ఫించ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేశారు.

May 21, 2026 / 10:16 AM IST

ఇది మాకు చెత్త సీజన్: రోహిత్ శర్మ

IPL 2026లో ముంబై ఘోర ప్రదర్శనపై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ‘ఇది మాకు మరో నిరాశాజనకమైన సీజన్. ముంబై ఇండియన్స్‌కే కాదు.. వ్యక్తిగతంగా నాకు కూడా ఈ సీజన్ పేలవంగా సాగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చాలా చెత్తగా ఉంది. అందుకే ముంబై చరిత్రలోనే ఇది చాలా చెత్త సీజన్‌గా నిలిచింది’ అని పేర్కొన్నాడు.

May 21, 2026 / 09:44 AM IST

బుమ్రాను తిప్పలు పెట్టిన బ్యాటర్లు వీరే!

జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కాకముందు అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్ల ఆల్‌టైమ్ జాబితా వెల్లడైంది. ఇందులో శిఖర్ ధావన్ 66 బంతులతో టాప్‌లో ఉండగా.. స్టార్ బ్యాటర్ మనీష్ పాండే 49 బంతులతో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో డుప్లెసిస్(43), వృద్ధిమాన్ సాహా(41), జడేజా(36) ఉన్నారు.

May 21, 2026 / 06:10 AM IST

కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

MIపై సాధించిన అద్భుత విజయంతో KKR ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మనీష్ పాండే సూపర్ ప్రదర్శనతో KKR ఘన విజయం సాధించి కీలక పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా పాయింట్ల టేబుల్‌లో 6వ స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్ రేసును మరింత రసవత్తరంగా మార్చింది.

May 21, 2026 / 02:53 AM IST

BREAKING: ముంబైని చిత్తుగా ఓడించిన KKR

ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 18.5 ఓవర్లలోనే 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. KKR విజయంలో మనీష్ పాండే(45), రోవ్‌మన్ పావెల్(40) కీలక పాత్ర పోషించారు. MI బౌలర్లు బాష్ 3 వికెట్లు పడగొట్టగా.. చాహార్, బూమ్ర, గజన్‌ఫర్ ఒక్కో వికెట్ తీశారు.

May 21, 2026 / 12:17 AM IST

ఆల్‌టైమ్ లీగ్‌లో నరైన్ రేర్ ఫీట్

IPLలో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డు సాధించాడు. లీగ్‌లో 4 ఓవర్ల కోటా పూర్తి చేసి, 6 లేదా అంతకంటే తక్కువ ఎకానమీ రేటు నమోదు చేయడం నరైన్‌కు ఇది 80వ సారి(178 స్పెల్స్‌లో). ఈ ఆల్‌టైమ్ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 48.3 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. నరైన్ 45.2 శాతంతో రెండో స్థానంలో, డేల్ స్టెయిన్ 45.0 శాతంతో మూడో స్థానంలో నిలిచారు.

May 20, 2026 / 11:10 PM IST

BREAKING: కోల్‌కతా ముందు స్వల్ప టార్గెట్

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 147/8 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 26, తిలక్ వర్మ 20, సూర్యకుమార్ యాదవ్ 15, రోహిత్ శర్మ 15 పరుగులు చేశారు. చివర్లో బోష్ 32* రన్స్‌తో సత్తా చాటాడు. KKR బౌలర్లలో సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్, కార్తిక్ త్యాగి తలో 2 వికెట్లు పడగొట్టారు.

May 20, 2026 / 10:22 PM IST

IPL 2026: నకిలీ టికెట్ల దందా..!

IPL క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ టికెట్ల దందాకు తెరలేపారు. సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా అభిమానులను మోసం చేస్తున్న ఈ ముఠాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక అడ్వైజరీ జారీ చేసింది. అనధికారిక ఏజెంట్ల వద్ద టికెట్లు కొని మోసపోవద్దని, కేవలం అధికారిక ప్లాట్‌ఫామ్స్ ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది.

May 20, 2026 / 10:00 PM IST

IPLలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు.!

IPL చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లుగా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. వీరిద్దరూ ఇప్పటివరకు చెరో 280 మ్యాచ్‌లతో రికార్డు సృష్టించారు. ఆ తర్వాతి స్థానాల్లో MS ధోని (278 మ్యాచ్‌లు), రవీంద్ర జడేజా (265 మ్యాచ్‌లు), దినేష్ కార్తిక్ (257 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

May 20, 2026 / 08:37 PM IST

KKR vs MI: వర్షం.. ఆగిన మ్యాచ్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తుండగా భారీ వర్షం మొదలవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. గ్రౌండ్‌స్టాఫ్ హుటాహుటిన పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఆట నిలిచే సమయానికి ముంబై ఇండియన్స్ 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. 

May 20, 2026 / 08:22 PM IST

ఈ పిల్లాడిని విడిచిపెట్టొద్దు: యువరాజ్

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌కు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఫిదా అయ్యాడు. ఐపీఎల్‌లో వైభవ్ ఆడుతున్న తీరు అద్భుతమని కొనియాడిన యువీ.. భవిష్యత్తు స్టార్ అయిన అతడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి సూచించాడు.

May 20, 2026 / 08:14 PM IST

కష్టాల్లో MI.. 23 పరుగులకే 3 వికెట్లు

IPL 2026లో భాగంగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో MI కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. కేవలం 9 బంతుల వ్యవధిలో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మంచి ఆరంభం కోసం ప్రయత్నించిన ఓపెనర్ రోహిత్ శర్మ (15) వెనుతిరిగాడు. KKR బౌలర్లలో గ్రీన్ 2 వికెట్లు తీయగా.. సౌరబ్ దుబే ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు.

May 20, 2026 / 08:03 PM IST