• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

IPL టికెట్ల బ్లాక్ దందా.. ముఠాను పట్టుకున్న పోలీసులు

ఉప్పల్ వేదికగా రేపు జరగనున్న SRH, RCB మ్యాచ్‌ టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సామాన్యులకు టికెట్లు దక్కకుండా, SM వేదికగా బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాపై 10 కేసులు నమోదు చేశారు. కోహ్లీ క్రేజ్‌తో విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ చివరి మ్యాచ్ టికెట్లను నిమిషాల్లో మాయం చేసి, వేల రూపాయలకు అమ్ముతుండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

May 21, 2026 / 04:41 PM IST

బ్యాడ్మింటన్ వ్యవస్థపై గుత్తా జ్వాలా విమర్శలు 

భారత బ్యాడ్మింటన్ వ్యవస్థపై స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాలా తీవ్ర విమర్శలు చేసింది. తన అకాడమీ ద్వారా క్షేత్రస్థాయిలో క్రీడాకారులకు సేవలు అందించేందుకు అధికారులను పదేపదే సంప్రదించినప్పటికీ, వారు తనను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించింది. క్రీడా వ్యవస్థలో ప్రతిభావంతులకు తగిన గుర్తింపు, మద్దతు లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

May 21, 2026 / 04:22 PM IST

కెనడా క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఇంటిపై కాల్పులు

కెనడా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమర్‌పాల్ ఖోసా ఇంటిపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఎవరికీ గాయాలు కాకపోగా.. ఇది వసూళ్ల బెదిరింపుల దాడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే 2026 టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు, కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వాపై ఐసీసీ విచారణ, ఫండింగ్ నిలిపివేతతో సతమతమవుతున్న కెనడా క్రికెట్‌కు ఈ ఘటన మరింత షాక్ ఇచ్చింది.

May 21, 2026 / 04:07 PM IST

1983 వరల్డ్ కప్ సంబరాల బిల్.. నిజమెంత?

1983 వరల్డ్ కప్ గెలిచాక భారత ఆటగాళ్లు ఓ హోటల్‌లో భారీఎత్తున పార్టీ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకు సంబంధించిన బిల్ అంటూ నెట్టింట ఓ ఇమేజ్ వైరల్ అయింది. దీనిని మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ టీమ్‌లో ఉన్న ఆటగాడు కీర్తి ఆజాద్ కొట్టిపడేశాడు. ఆ బిల్ అసత్యమని తెలిపాడు. దానిపై ఉన్న సంతకం కూడా కపిల్ దేవ్‌ది కాదని స్పష్టం చేశాడు.

May 21, 2026 / 03:50 PM IST

కంకషన్ వివాదంపై KKR కోచ్ క్లారిటీ!

MIతో జరిగిన మ్యాచ్‌లో KKR వికెట్ కీపర్ రఘువంశీ గాయపడటంతో అతని స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా తేజస్విని ఆడించడం తీవ్ర వివాదానికి దారితీసింది. రఘువంశీకి తలకు దెబ్బే తగల్లేదని SMలో విమర్శలు వచ్చాయి. దీనిపై అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ స్పందిస్తూ..క్యాచ్‌ను అందుకొనేందుకు ప్రయత్నించి రఘువంశీ గాయపడ్డాడు. అందుకే కంకషన్ సబ్ తీసుకోవాల్సి వచ్చిందన్నాడు.

May 21, 2026 / 03:09 PM IST

మసూద్ కెప్టెన్సీకి ముప్పు!

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ 2-0తో ఘోర టెస్ట్ సిరీస్ పరాజయం చవిచూసింది. మే 20న జరిగిన ఆఖరి టెస్టులో 78 పరుగులతో ఓడటంతో షాన్ మసూద్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో 2026 ఆగస్టు ఇంగ్లాండ్ పర్యటన కంటే ముందే మసూద్ స్థానంలో కొత్త టెస్ట్ కెప్టెన్‌ను నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది.

May 21, 2026 / 02:37 PM IST

పాకిస్థాన్ కెప్టెన్‌పై వేలాడుతున్న కత్తి..!!

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ 2-0 తేడాతో ఘోర టెస్ట్ సిరీస్ పరాజయం చవిచూసింది. మే 20న జరిగిన ఆఖరి టెస్టులో 78 పరుగులతో ఓడటంతో షాన్ మసూద్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో 2026 ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటన కంటే ముందే మసూద్ స్థానంలో కొత్త టెస్ట్ కెప్టెన్‌ను నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది.

May 21, 2026 / 02:37 PM IST

ఇండియా-A జట్టులోకి అనుకుల్‌ రాయ్‌

శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టులోకి ఆల్‌రౌండర్ అనుకుల్‌ రాయ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే సిరీస్ కోసం భారత సీనియర్ జట్టుకు హర్ష్‌ దుబే తొలిసారి ఎంపికవడంతో.. అతని స్థానంలో అనుకుల్‌ను ఎంపిక చేశారు. ఈ మెగా సిరీస్ జూన్ 9 నుంచి దంబుల్లాలో ప్రారంభం కానుంది.

May 21, 2026 / 02:29 PM IST

IPL 2026: PBKS, KKR మధ్య తేడా ఇదే..!!

ఈ ఏడాది IPLలో తొలి ఆరు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా PBKS పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో KKR తొలి ఆరు మ్యాచ్‌లలో గెలుపు లేకుండా 10వ స్థానంలో ఉంది. ఆ తర్వాత PBKS వరుసగా 6 మ్యాచ్‌లలో ఓడి ఐదో స్థానానికి పరిమితం కాగా.. KKR చివరి 7 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లు గెలిచి ఆరో స్థానానికి చేరి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

May 21, 2026 / 12:08 PM IST

కోడ్‌ ఉల్లంఘన.. హార్దిక్‌ పాండ్యాకు జరిమానా

KKRతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన MIకు మరో బిగ్ షాక్ తగిలింది. ముంబై బౌలింగ్ చేస్తున్న సమయంలో ప్రవర్తనా నియమావళిని కెప్టెన్‌ హార్దిక్ ఉల్లంఘించాడు. 10వ ఓవర్‌లో బౌలింగ్ రన్-అప్‌కు వెళ్తూ కోపంతో వికెట్ బెయిల్స్‌ను పాండ్యా పడగొట్టాడు. దీంతో మ్యాచ్‌ ఫీజులో 10శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌‌ను BCCI విధించింది.

May 21, 2026 / 11:11 AM IST

ముంబై ఇండియన్స్ పేరిట చెత్త రికార్డు

IPL చరిత్రలోనే అరుదైన చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. వరుసగా 3 మ్యాచ్‌ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగిన రెండో జట్టుగా ముంబై నిలిచింది. సూర్యకుమార్, బుమ్రా, పాండ్యా వరుసగా నాయకత్వం వహించారు. కాగా ఈ జాబితాలో గతంలో పుణే వారియర్స్ ఇండియా మాత్రమే ఉంది. రాస్ టేలర్, ఏంజెలో మాథ్యూస్, ఆరోన్ ఫించ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేశారు.

May 21, 2026 / 10:16 AM IST

ఇది మాకు చెత్త సీజన్: రోహిత్ శర్మ

IPL 2026లో ముంబై ఘోర ప్రదర్శనపై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ‘ఇది మాకు మరో నిరాశాజనకమైన సీజన్. ముంబై ఇండియన్స్‌కే కాదు.. వ్యక్తిగతంగా నాకు కూడా ఈ సీజన్ పేలవంగా సాగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చాలా చెత్తగా ఉంది. అందుకే ముంబై చరిత్రలోనే ఇది చాలా చెత్త సీజన్‌గా నిలిచింది’ అని పేర్కొన్నాడు.

May 21, 2026 / 09:44 AM IST

బుమ్రాను తిప్పలు పెట్టిన బ్యాటర్లు వీరే!

జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కాకముందు అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్ల ఆల్‌టైమ్ జాబితా వెల్లడైంది. ఇందులో శిఖర్ ధావన్ 66 బంతులతో టాప్‌లో ఉండగా.. స్టార్ బ్యాటర్ మనీష్ పాండే 49 బంతులతో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో డుప్లెసిస్(43), వృద్ధిమాన్ సాహా(41), జడేజా(36) ఉన్నారు.

May 21, 2026 / 06:10 AM IST

కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

MIపై సాధించిన అద్భుత విజయంతో KKR ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మనీష్ పాండే సూపర్ ప్రదర్శనతో KKR ఘన విజయం సాధించి కీలక పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా పాయింట్ల టేబుల్‌లో 6వ స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్ రేసును మరింత రసవత్తరంగా మార్చింది.

May 21, 2026 / 02:53 AM IST

BREAKING: ముంబైని చిత్తుగా ఓడించిన KKR

ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 18.5 ఓవర్లలోనే 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. KKR విజయంలో మనీష్ పాండే(45), రోవ్‌మన్ పావెల్(40) కీలక పాత్ర పోషించారు. MI బౌలర్లు బాష్ 3 వికెట్లు పడగొట్టగా.. చాహార్, బూమ్ర, గజన్‌ఫర్ ఒక్కో వికెట్ తీశారు.

May 21, 2026 / 12:17 AM IST