ఈ ఏడాది IPLలో తొలి ఆరు మ్యాచ్లలో ఓటమి లేకుండా PBKS పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో KKR తొలి ఆరు మ్యాచ్లలో గెలుపు లేకుండా 10వ స్థానంలో ఉంది. ఆ తర్వాత PBKS వరుసగా 6 మ్యాచ్లలో ఓడి ఐదో స్థానానికి పరిమితం కాగా.. KKR చివరి 7 మ్యాచ్లలో 6 మ్యాచ్లు గెలిచి ఆరో స్థానానికి చేరి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.