KRNL: ఉమ్మడి జిల్లాల్లో భానుడు భగ్గుమన్నాడు. ప్రజలు వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంజామల, పాణ్యం, బనగానపల్లె వంటి మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెల 26 వరకు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.