• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

IND vs ENG: జాక్స్ ఒక్కడేనా? ఆ ఇద్దరూ ప్రమాదమే!

రేపటి T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్రదర్శన కీలకం కానుంది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల అతణ్ని బ్యాటింగ్, బౌలింగ్‌లో కట్టడి చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. అయితే కెప్టెన్ బ్రూక్, బట్లర్ వికెట్లు కూడా కీలకమే. ఇప్పటికే బ్రూక్ అదరగొడుతుండగా.. ఫామ్‌లో లేడని బట్లర్‌ని ఏ మాత్రం లైట్ తీసుకున్నా బౌలర్లందరికీ చుక్కలు కనబడటం ఖాయం.

March 4, 2026 / 01:22 PM IST

కీలక మైలురాయికి చేరువలో బుమ్రా

భారత బౌలర్ బుమ్రా కీలక మైలురాయికి ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 116 వికెట్లు పడగొట్టిన అతను.. రేపు ఇంగ్లండ్‌పై ఒక్కరినీ ఔట్ చేసినా, భారత్ తరఫున 500 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలుస్తాడు. కుంబ్లే(953), అశ్విన్(765), హర్భజన్(707), కపిల్(687), రవీంద్ర జడేజా(634), జహీర్(597), శ్రీనాథ్(551) ఇప్పటికే ఈ క్లబ్‌లో ఉన్నారు.

March 4, 2026 / 01:02 PM IST

ఇంగ్లండ్‌తో సెమీస్.. బుమ్రా కీలకం: సన్నీ

T20 WC రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ బుమ్రాతో ఆరంభంలోనే బౌలింగ్ చేయించాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. బుమ్రాతో 5వ ఓవర్ వేయిస్తున్నారని, అప్పటికే ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటుండటంతో అతణ్ని సమర్థంగా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాడు. అరంభంలో బుమ్రాకు బౌలింగ్ ఇస్తే ప్రత్యర్థిని దెబ్బకొట్టగలడని, దీంతో మ్యాచ్ ఫలితం మారుతుందని సన్నీ అన్నాడు.

March 4, 2026 / 12:39 PM IST

IND vs NZ: రోకో అభిమానులకు గుడ్ న్యూస్!

భారత్ ఈ ఏడాది OCT-NOVలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి ఆతిథ్య జట్టుతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. అలాగే 5 T20లు, 2 టెస్టుల సిరీసుల్లోనూ తలపడనుంది. అయితే 2027 వరల్డ్ కప్ ముంగిట 3 వన్డేలకు బదులు 5 ఆడాలని, 5 T20లకు బదులు 3 సరిపోతాయని BCCIకి NZC ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే నిజమైతే టీమిండియాకు ప్రాక్టీస్, అభిమానులకు రోహిత్-కోహ్లీని అదనంగా 2 వన్డేల్లో చూసేందుకు అవకాశం లభిస్తుంది.

March 4, 2026 / 12:26 PM IST

సంగక్కర ఇంట తీవ్ర విషాదం

శ్రీలంక క్రికెట్ దిగ్గజం, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి క్షేమ సంగక్కర కన్నుమూశారు. క్షేమ మృతి పట్ల లసిత్ మలింగ సహా పలువురు మాజీ క్రికెటర్లు, లీగల్ కమ్యూనిటీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ప్రముఖ న్యాయవాదిగా క్యాండీలో గొప్ప పేరు కలిగిన క్షేమ అంత్యక్రియలను ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

March 4, 2026 / 12:06 PM IST

SA vs NZ: సెమీస్‌కు తుది జట్లు(అంచనా)

సౌతాఫ్రికా: డీకాక్, రికెల్టన్, మార్క్రమ్(C), బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బాష్, మహారాజ్, రబాడ, ఎంగిడిన్యూజిలాండ్: ఫిన్ ఆలెన్, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, డేరిల్ మిచెల్, శాంట్నర్(C), నీషమ్, డఫీ/హెన్రీ, ఫెర్గూసన్, సోధి

March 4, 2026 / 11:31 AM IST

ఇంగ్లండ్‌తో సెమీస్.. రవిశాస్త్రి కీలక సూచనలు

ఇంగ్లండ్‌తో రేపటి T20 WC సెమీస్ పోరు నేపథ్యంలో భారత్‌కు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. అభిషేక్ మానసికంగా ఇబ్బందిపడటమే తక్కువ స్కోర్లకు కారణమని, అయినప్పటికీ అతణ్ని సెమీప్ జట్టులో కొనసాగించాలని సూచించాడు. అయితే అతనికి బదులు ఇషాన్‌తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలని, అటు రింకూ సింగ్‌నీ జట్టులోకి తీసుకోవాలని పేర్కొన్నాడు.

March 4, 2026 / 10:55 AM IST

IPL 2026 ఫైనల్ జరిగేది అక్కడే

RCB తమ హోం మ్యాచులను 5 చిన్నస్వామిలో, 2 రాయ్‌పూర్‌లో ఆడుతుందని ఆ ఫ్రాంచైజీ CEO రాజేశ్ మీనన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఒక ప్లేఆఫ్ మ్యాచ్, అలాగే టోర్నీ ఫైనల్‌కు చిన్నస్వామి ఆతిథ్యమిస్తుందని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సంతోష్ మీనన్ తెలిపారు. దీంతో RCB ఫ్యాన్స్ హర్షం వ్యక్తంచేస్తున్నారు. కాగా 2014, 2016 టోర్నీ ఫైనల్స్ చిన్నస్వామిలోనే జరిగాయి.

March 4, 2026 / 10:33 AM IST

ఆసీస్‌తో టెస్ట్.. జట్టుకు రేణుక దూరం

ఆస్ట్రేలియాతో ఈ నెల 6 నుంచి జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు భారత స్టార్ బౌలర్ రేణుకా సింగ్ దూరమైంది. గత కొంతకాలంగా వరుసగా మ్యాచ్‌లాడుతున్న ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆమె స్థానంలో యువ పేసర్ కశ్వీ గౌతమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ పెర్త్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.10-50 గంటలకు ప్రారంభమవుతుంది.

March 4, 2026 / 09:44 AM IST

ICC ఈవెంట్స్‌.. భారత్‌దే ‘సెమీస్’ రికార్డ్

ICC ఈవెంట్స్‌లో అత్యధికంగా 20* సార్లు సెమీస్ ఆడిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో రేపు ఆడేది భారత్‌కు T20 WCలో ఆరో సెమీస్ కాగా.. ODI WCలో 8 సార్లు తలపడింది. అటు ఛాంపియన్స్ ట్రోఫీలో 5, WTCలో 2 సార్లు క్వాలిఫై(ఫైనలిస్ట్) అయింది. ఇక ఆస్ట్రేలియా(18)-న్యూజిలాండ్(18*), ఇంగ్లండ్(16*)-పాక్(16), సౌతాఫ్రికా(15*) తర్వాతి 3 స్థానాల్లో ఉన్నాయి.

March 4, 2026 / 09:38 AM IST

పొట్టి కప్ అంటే ‘ఆసియా’ ఉండాల్సిందే!

T20 WC 2026 సెమీస్‌లో 4 ఖండాల నుంచి 4 వేర్వేరు దేశాలు(SA-ఆఫ్రికా, NZ-ఓషియానియా, IND-ఆసియా, ENG-యూరోప్) తలపడుతున్న సంగతి తెలిసిందే. గత 9 టోర్నీల రికార్డులు గమనించినా.. ప్రతిసారీ ఆసియా నుంచి కనీసం ఓ జట్టు(భారత్, పాక్, లంక, అఫ్గన్) అయినా నాకౌట్స్‌లో తలపడింది. ఆసియా తర్వాత.. ఓషియానియా నుంచి 2009, 14, 24 మినహా అన్ని టోర్నీల్లోనూ ఆస్ట్రేలియా/న్యూజిలాండ్/రెండూ ఆడాయి.

March 4, 2026 / 08:59 AM IST

భారత్‌లో మేం సేఫ్: న్యూజిలాండ్ కెప్టెన్

పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం ఆందోళన కలిగిస్తోందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పేర్కొన్నాడు. భారత్‌లో తాము సురక్షితంగా ఉన్నామని, ఇవాళ సౌతాఫ్రికాతో జరిగే T20 WC సెమీస్ పోరుకు మాట్ హెన్రీ అందుబాటులో ఉంటాడని తెలిపాడు. కాగా శ్రీలంకను పాక్ నిర్ణీత స్కోర్‌కు పరిమితం చేయలేకపోవడంతో కివీస్ లక్కీగా సెమీస్ బెర్త్ కొట్టేసిన సంగతి తెలిసిందే.

March 4, 2026 / 08:12 AM IST

IND vs ENG సెమీస్: ‘అన్నీ సుపరిచిత వ్యూహాలే’

T20 WCలో భారత్, ఇంగ్లండ్ వరుసగా 3వ సారి సెమీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరస్పరం సంధించుకునేందుకు రహస్య ఆస్త్రాలేమీ లేవని, ఎవరి వ్యూహాలు ఏంటనేది ఇరుజట్లకూ తెలుసని ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ కరన్ పేర్కొన్నాడు. రేపు వాంఖడేలో భారత్‌పై విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్తామని ధీమా వ్యక్తంచేశాడు. అభిషేక్ కోసం ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

March 4, 2026 / 07:52 AM IST

T20 WC నాకౌట్స్.. RO-KOవే రికార్డ్స్

T20 WC నాకౌట్స్ రౌండ్‌లో అత్యధికంగా 373 రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 6 మ్యాచుల్లోనే కోహ్లీ ఈ ఘనత సాధించగా.. రోహిత్(8 మ్యాచుల్లో 227), బట్లర్(6లో 226) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ రౌండ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డ్(5) కోహ్లీ పేరిట ఉండగా.. అత్యధిక మ్యాచులాడిన ఆటగాడిగా రోహిత్(8) కొనసాగుతున్నాడు.

March 4, 2026 / 07:22 AM IST

ఇప్పుడైనా సఫారీలపై కివీస్ గెలుస్తుందా?

T20 WC సెమీస్‌లో ఇవాళ సౌతాఫ్రికా-న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇరుజట్లూ నాకౌట్స్‌లో తలపడటం ఇదే తొలిసారి కాగా.. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఢీకొన్న 5 సందర్భాల్లోనూ సఫారీలదే విజయం. ఓవరాల్‌గానూ T20ల్లో కివీస్‌పై 7-12తో ఆ జట్టుదే పైచేయి. పైగా ఈ టోర్నీలో సౌతాఫ్రికా వరుస విజయాలతో జోరు మీదుంది. మరి న్యూజిలాండ్ ఈసారి ఎలా రాణిస్తుందో చూడాలి.

March 4, 2026 / 06:39 AM IST