CSKతో మ్యాచ్లో DC స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిస్సంక(19), రాహుల్(12), నితీష్(13), కరుణ్(13) తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో ఢిల్లీ 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టబ్స్(38), రిజ్వీ(40*) కలిసి 6వ వికెట్కు 65 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. దీంతో DC 155/7 పోరాడే స్కోరు సాధించింది. CSK బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.