• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

MI Vs LSG: వాంఖడేలో పూరన్ సిక్సర్ల వర్షం

LSG పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు కేవలం 16 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఇప్పటికే ఒక ఫోర్, ఏకంగా 7 సిక్సర్లు బాదడం విశేషం. పూరన్‌కు ఈ సీజన్‌లో ఇది తొలి హాఫ్ సెంచరీ కాగా, ఐపీఎల్ కెరీర్‌లో ఓవరాల్‌గా 14వ అర్ధశతకం.

May 4, 2026 / 08:13 PM IST

MI Vs LSG: పూరన్, మార్ష్ మెరుపులు

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో LSG బ్యాటర్లు చెలరేగుతున్నారు. మిచెల్ మార్ష్ 20 బంతుల్లో 35 పరుగులు, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 39 పరుగులతో మెరుపులు మెరిపిస్తున్నారు. వీరిద్దరి ధాటికి లక్నో సూపర్ జెయింట్స్ పవర్‌ప్లే ముగిసే సమయానికే 90/1 స్కోరు సాధించింది. అంతకుముందు ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ 13 పరుగులు చేసి అల్లా ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

May 4, 2026 / 08:07 PM IST

MI Vs LSG: తుది జట్లు ఇవే

LSG: మార్ష్, జోష్ ఇంగ్లిస్, పూరన్, మార్‌క్రమ్, పంత్(c & wk), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షమీ, మొహ్సిన్, ప్రిన్స్, అవేష్. IMPACT: సమద్, షాబాజ్, మయాంక్ యాదవ్, సిద్ధార్థ్, దిగ్వేష్MI: రికెల్టన్(wk), నమన్, సూర్య (c), తిలక్, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, బుమ్రా, అల్లా గజన్‌ఫర్, రఘు శర్మ. IMPACT: రోహిత్, మింజ్, శార్దూల్, బౌల్ట్, రావత్

May 4, 2026 / 07:12 PM IST

BREAKING: రోహిత్ ఇన్.. పాండ్యా ఔట్

వాంఖడే స్టేడియం వేదికగా LSGతో మ్యాచ్‌లో MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే దాదాపు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన ఈ రెండు జట్లు, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌కు పాండ్యా దూరం కాగా, రోహిత్ బరిలోకి దిగుతున్నాడు. MI కెప్టెన్‌గా సూర్య వ్యవహరిస్తున్నాడు.

May 4, 2026 / 07:00 PM IST

PSL- 2026: ఛాంపియన్స్‌గా బాబర్ ఆజమ్ టీమ్

PSL- 2026 టైటిల్‌ను బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ జల్మీ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్స్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టును ఓడించి ఛాంపియన్స్‌గా నిలిచింది. పెషావర్ ఈ టైటిల్ గెలుచుకోవడం రెండోసారి కాగా, కెప్టెన్‌గా ఆజమ్‌కు ఇది తొలి PSL టైటిల్. ఈ టోర్నీలో 2 సెంచరీలతో 588 పరుగులు చేసిన బాబర్ ఫైనల్‌లో మాత్రం గోల్డెన్ డకౌటయ్యాడు.

May 4, 2026 / 06:15 PM IST

IPL: ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

రేపు CSK, DC జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా ధోనీ బరిలోకి దిగడం లేదు. గాయంతో బాధపడుతున్న ధోనీ, జట్టుతో పాటు ఢిల్లీకి రాకుండా చెన్నైలోనే ఉండిపోయినట్లు సమాచారం. దీంతో ‘అసలు ఈ సీజన్‌లో ధోనీని ఒక్క మ్యాచ్‌కైనా మైదానంలో చూడగలమా?’ అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. CSK ప్లేఆఫ్స్ చేరకపోతే, ఆ జట్టుకు మిగిలి ఉన్నవి మరో 5 మ్యాచ్‌లు మాత్రమే.

May 4, 2026 / 05:55 PM IST

IPL: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!

LSGతో మ్యాచ్‌లో MI స్టార్ ప్లేయర్ రోహిత్ బరిలోకి దిగుతాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రోహిత్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, దీంతో అతడు ఈ మ్యాచ్‌లో కూడా ఆడటం కష్టమేనని సమాచారం. దీంతో MI అభిమానులకు మరోసారి నిరాశే ఎదురవనున్నట్లు కనిపిస్తోంది. ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రోహిత్, గాయం కారణంగా ఇప్పటికే 5 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.

May 4, 2026 / 05:33 PM IST

IPL: టాప్ జట్లకు షాక్ ఇచ్చిన GT

GT వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో దూసుకొచ్చింది. 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో.. SRH, RRతో సమానంగా నిలిచింది. అయితే, నెట్ రన్ రేట్ కారణంగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ముఖ్యంగా, GT తన చివరి రెండు మ్యాచ్‌ల్లో టాప్-2 జట్లు PBKS, RCBని ఓడించడం విశేషం. గిల్ కెప్టెన్సీలో GT బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో సమిష్టి ప్రదర్శనతో అదరగొడుతోంది.

May 4, 2026 / 04:43 PM IST

IPL: నిప్పులు చెరుగుతున్న GT బౌలర్లు

GT విజయాల్లో బౌలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లో GT.. CSK (158), RCB (155), PBKS (163) జట్లను స్వల్ప స్కోర్లకే పరిమితం చేసింది. ముఖ్యంగా సిరాజ్, రబడ పవర్‌ప్లేలోనే వికెట్లు తీస్తూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందిస్తున్నారు. ఇక హోల్డర్, స్పిన్నర్ రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు పడగొడుతున్నారు.. దీంతో ఆ జట్టు సులభంగా విజయాలను అందుకుంటోంది.

May 4, 2026 / 04:04 PM IST

IPL 2026: అదరగొడుతున్న GT బౌలర్లు

GT విజయాల్లో బౌలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లో GT.. CSK (158), RCB (155), PBKS (163) జట్లను స్వల్ప స్కోర్లకే పరిమితం చేసింది. ముఖ్యంగా సిరాజ్, రబడ పవర్‌ప్లేలోనే వికెట్లు తీస్తూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందిస్తున్నారు. ఇక హోల్డర్, స్పిన్నర్ రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు పడగొడుతున్నారు.. దీంతో ఆ జట్టు సులభంగా విజయాలను అందుకుంటోంది.

May 4, 2026 / 04:04 PM IST

కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా: బెథెల్

విరాట్ కోహ్లీపై RCB ప్లేయర్ జాకబ్ బెథెల్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమని బెథెల్ పేర్కొన్నాడు. అలాగే, కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించడం తనకు ఒక కలలా ఉందని తెలిపాడు. ముఖ్యంగా ఛేజింగ్‌లో కోహ్లీ ఆడే తీరును చూసి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.

May 4, 2026 / 03:28 PM IST

IPL: సత్తా చాటుతున్న తెలుగు బౌలర్

హైదరాబాదీ స్పీడ్ స్టార్ సిరాజ్ IPLలో అదరగొడుతున్నాడు. టెస్టు బౌలర్‌గా ముద్రపడిన సిరాజ్, తాను పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ అద్భుతాలు చేయగలనని నిరూపిస్తున్నాడు. ప్రస్తుత IPL సీజన్‌లో తన బౌలింగ్‌తో GT విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టిన సిరాజ్, ఈ సీజన్‌లో అత్యధికంగా 109 డాట్ బాల్స్ వేసి రికార్డు సృష్టించాడు.

May 4, 2026 / 03:05 PM IST

స్వదేశానికి RCB స్టార్ ప్లేయర్

KKR స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న DCతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సాల్ట్, ఆ గాయానికి స్కానింగ్ చేయించుకోవడం కోసం ఇంగ్లండ్ వెళ్లినట్లు సమాచారం. అయితే, అతడు త్వరలోనే తిరిగి జట్టుతో చేరుతాడని RCB యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, వారం రోజుల విరామం లభించడంతో RCB ప్లేయర్లు మాల్దీవులలో సేదతీరుతున్నారు.

May 4, 2026 / 02:55 PM IST

MI Vs LSG: హెడ్ టు హెడ్ రికార్డులు

IPL చరిత్రలో MI, LSG జట్ల మధ్య జరిగిన హెడ్ టు హెడ్ రికార్డుల్లో లక్నో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. LSG 6, MI 2 సార్లు గెలిచాయి. అలాగే, వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్‌లలో ముంబై 3, లక్నో 3 సార్లు గెలిచాయి. దీంతో ఇవాళ్టి పోరులో విజయం ఎవరు సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.

May 4, 2026 / 02:34 PM IST

క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన సాయి సుదర్శన్

క్రిస్ గేల్ పేరిట 13 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ బద్ధలు కొట్టాడు. ఐపీఎల్‌లో తన మొదటి 50 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు(2178 రన్స్) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు 2061 పరుగులతో క్రిస్ గేల్ పేరిట ఉండేది. మిచెల్ మార్ష్ 1933 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

May 4, 2026 / 11:20 AM IST