విరాట్ కోహ్లీపై RCB ప్లేయర్ జాకబ్ బెథెల్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమని బెథెల్ పేర్కొన్నాడు. అలాగే, కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించడం తనకు ఒక కలలా ఉందని తెలిపాడు. ముఖ్యంగా ఛేజింగ్లో కోహ్లీ ఆడే తీరును చూసి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.