క్రిస్ గేల్ పేరిట 13 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ బద్ధలు కొట్టాడు. ఐపీఎల్లో తన మొదటి 50 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు(2178 రన్స్) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు 2061 పరుగులతో క్రిస్ గేల్ పేరిట ఉండేది. మిచెల్ మార్ష్ 1933 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.