రేపు CSK, DC జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా ధోనీ బరిలోకి దిగడం లేదు. గాయంతో బాధపడుతున్న ధోనీ, జట్టుతో పాటు ఢిల్లీకి రాకుండా చెన్నైలోనే ఉండిపోయినట్లు సమాచారం. దీంతో ‘అసలు ఈ సీజన్లో ధోనీని ఒక్క మ్యాచ్‌కైనా మైదానంలో చూడగలమా?’ అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. CSK ప్లేఆఫ్స్ చేరకపోతే, ఆ జట్టుకు మిగిలి ఉన్నవి మరో 5 మ్యాచ్‌లు మాత్రమే.