ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH జట్టుకు నితిష్ రెడ్డి తొలి వికెట్‌ను అందించాడు. 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో దూకుడుగా ఆడుతున్న విల్ జాక్స్(46).. నితిష్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై 7.1 ఓవర్లలో 93 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరోవైపు రికల్టన్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఓపెనర్లు విల్ జాక్స్ (38*), ర్యాన్ రికల్టన్ (37*) బౌండరీలతో పోటీపడుతూ పరుగులు సాధిస్తున్నారు. వీరి ధాటికి పవర్‌ప్లే ముగిసే సమయానికి ముంబై వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. MI బ్యాటింగ్ చూస్తుంటే 200 పరుగుల మార్క్‌ను సులభంగా క్రాస్ అయ్యేలా కనిపిస్తుంది.
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో అతడు ఇప్పటివరకు కేవలం 511 బంతుల్లోనే 99 సిక్సర్లు బాదాడు. మరో సిక్సర్ కొడితే, టీ20 చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు 843 బంతులతో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ పేరిట ఉంది.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వైభవ్ బ్యాట్‌లో ఏదో ‘AI చిప్’ ఉండి ఉంటుందని ఓ మాజీ ప్లేయర్ అనుమానం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ వ్యాఖ్యలకు వైభవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘నా బ్యాట్‌లో ఏదైనా ఉందంటే అది దేవుడి ఆశీర్వాదం మాత్రమే.. బహుశా ఆ దేవుడే నా బ్యాట్‌లో ఏదో మ్యాజిక్ పెట్టి ఉంటాడు’ అంటూ సమాధానమిచ్చాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ SRHతో జరగనున్న మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. రోహిత్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని ముంబై యాజమాన్యం వెల్లడించింది. దీంతో ఈ మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగుతాడని ఆశించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. కాగా, RCBతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు తొడ కండరాలు పట్టేయడంతో ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు ఇ-సిగరెట్ తాగినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన బీసీసీఐ అధికారి.. పరాగ్ నుంచి ఇప్పటికే వివరణ కోరినట్లు తెలిపారు. అతడు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు ఆసక్తికరంగా ఉంది. ఈ రెండు జట్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడగా, ముంబై 15 విజయాలు సాధించి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. SRH 10 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఇవాళ మ్యాచ్ జరిగే వాంఖడే స్టేడియంలో జరిగిన 9 మ్యాచ్‌ల్లో ముంబై 7 సార్లు గెలిచింది.
ICC తాజాగా మహిళల టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించకపోవడంతో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఒక స్థానం దిగజారి ఐదో ర్యాంకుకు పడిపోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు జార్జియా వోల్, బెత్ మూనీ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ రెండు స్థానాలు ఎగబాకి మూడవ స్థానానికి చేరుకుంది.
PSLలో భాగంగా ఇస్తామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ శతక్కొట్టాడు. PSLలో అతనికి ఇది రెండో సెంచరీ. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో కెప్టెన్ హోదాలో అత్యధిక సెంచరీలు(9) సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్(8) పేరిట ఈ రికార్డు ఉంది.
IPL 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. MI ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న MI.. ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిపోయింది. దీంతో ఇక నుంచి ఆడబోయే 7 మ్యాచ్‌లకు 7 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఇవాళ్టి మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది.
మహిళల టీ20 ప్రపంచకప్-2026 కోసం న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానుంది.కివీస్ జట్టు ఇదేఅమెలీయా(C), సూజీ బేట్స్, సోఫీ డివైన్, ప్లోరా డెవాన్‌షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ, హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్‌మేరీ, నెన్సీ, జార్జియా, ఇజ్జీ షార్స్, లీ తహుహు
PBKSపై సాధించిన విజయం గురించి RR కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించారు. ‘ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఇచ్చిన ఆరంభం మా పనిని చాలా సులభం చేసింది. పవర్‌ప్లే తర్వాత రన్ రేట్ కాస్త తగ్గినప్పటికీ, చివర్లో శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్‌ను పంజాబ్ నుంచి లాగేసుకున్నారు. వారిద్దరూ ఆడిన తీరు నిజంగా ప్రశంసనీయం’ అని కొనియాడాడు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు(కేవలం 167 బంతుల్లోనే) పూర్తి చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆండ్రీ రసెల్ (188 బంతులు), అభిషేక్ శర్మ (195 బంతులు) వంటి విధ్వంసకర ఆటగాళ్ల రికార్డులను అధిగమించాడు.
RRతో ఓటమికి బౌలింగ్‌లో ఫెయిల్యూరే కారణమని PBKS కెప్టెన్ శ్రేయస్ అన్నాడు. ‘మేము చేసిన 222 రన్స్ మంచి స్కోరే. బౌలింగ్‌లోనే తడబడ్డాం. స్లో బాల్స్, యార్కర్లు వేయాలన్న ప్లాన్‌ను అమలు చేయలేదు. ఫెరీరా, శుభమ్ భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ప్రస్తుతం T20ల్లో బ్యాటర్లు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతున్నారు. అది బౌలర్లకు కష్టంగా మారుతోంది’ అని పేర్కొన్నాడు.