• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఒమర్జాయ్ తల్లికి పంజాబ్ కింగ్స్ సంతాపం

IPL 2026లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయర్లు నల్లటి ఆర్మ్ బ్యాండ్స్ ధరించి కనిపించిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తన తల్లిని కోల్పోయాడు. ఇందుకు సంతాపంగా PBKS సభ్యులు నల్ల బ్యాండ్‌లు ధరించారు. ఈ విషయాన్ని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఒమర్జాయ్ తల్లి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు.

April 29, 2026 / 03:05 AM IST

IPL 2026: పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓటమి

IPL 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జోరుకు రాజస్తాన్ బ్రేక్ వేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. తొలిసారి ఓటమి చవిచూసింది. అయితే, KKRతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. మరో ఆరు మ్యాచ్‌లలో గెలిచింది. దీంతో 13 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

April 29, 2026 / 12:35 AM IST

ఫెర్రీరా విధ్వంసం.. రాజస్థాన్ విజయం

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన RR 19.2 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. జైస్వాల్ (51), ఫెర్రీరా (52*) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ (43), రియాన్ పరాగ్ (29), శుభమ్ దూబే (31*) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీశాడు.

April 28, 2026 / 10:55 PM IST

PBKS vs RR: ఉత్కంఠ సాగుతున్న మ్యాచ్

IPL 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభమ్ దూబే (17), ఫెర్రీరా (19) ఉన్నారు. రాజస్థాన్ విజయానికి 24 బంతుల్లో 43 పరుగులు అవసరం.

April 28, 2026 / 10:43 PM IST

PBKS vs RR: నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 151 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. చాహాల్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్ (29) క్యాచ్ ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ స్కోర్ 151/4గా ఉంది. ప్రస్తుతం క్రీజులో ఫెర్రీరా (8*), శుభమ్ దూబే (0*) ఉన్నారు. రాజస్థాన్ విజయానికి 36 బంతుల్లో 72 పరుగులు అవసరం.

April 28, 2026 / 10:30 PM IST

BREAKING: పంజాబ్ భారీ స్కోరు

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ (59), స్టోయినిస్ (62*) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ప్రియాంష్ ఆర్య (29), కూపర్ కొన్నొల్లీ (30), శ్రేయస్ అయ్యర్ (30) సమిష్టిగా రాణించడంతో పంజాబ్.. 222/4 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యశ్ రాజ్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్, బర్గర్ తలో వికెట్ పడగొట్టారు.

April 28, 2026 / 09:07 PM IST

IPL: రాజస్థాన్‌పై చెలరేగిన ప్రభుసిమ్రాన్

పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే మరో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో ప్రభుసిమ్రాన్‌కు ఇది నాలుగో అర్ధ శతకం కాగా, ఓవరాల్‌గా ఐపీఎల్ కెరీర్‌లో 11వది కావడం విశేషం.

April 28, 2026 / 08:31 PM IST

PBKS Vs RR: పంజాబ్ కింగ్స్ దూకుడు

RRతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ప్రభుసిమ్రాన్, ప్రియాంష్ ఆర్య కలిసి కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు జోడించారు. ప్రియాంష్ 11 బంతుల్లో 29 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం కొన్నల్లీ(20)తో కలిసి ప్రభుసిమ్రాన్(29) దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం 7 ఓవర్లులో పంజాబ్ స్కోరు 80/1.

April 28, 2026 / 08:12 PM IST

PBKS Vs RR: తుది జట్లు ఇవే

RR: సూర్యవంశీ, జైస్వాల్, జురెల్ (WK), పరాగ్ (c), ఫెరీరా, జడేజా, షనక, ఆర్చర్, బర్గర్, బ్రిజేష్, యశ్ పుంజా. IMPACT: హెట్మెయర్, శుభమ్, తుషార్, బిష్ణోయ్, రవిPBKS: ప్రియాంష్, ప్రభ్‌సిమ్రాన్(WK), కొన్నోలీ, అయ్యర్ (c), సూర్యాంశ్, వధేరా, స్టోయినిస్, యాన్‌సన్, ఫెర్గూసన్, అర్ష్‌దీప్, చాహల్. IMPACT: ముషీర్ అహ్మద్, విష్ణు, వైషాక్, బార్ట్‌లెట్, హర్‌ప్రీత్

April 28, 2026 / 07:08 PM IST

ఐపీఎల్ చరిత్రలో RCB అరుదైన రికార్డు

ఐపీఎల్ చరిత్రలో RCB జట్టు అరుదైన రికార్డును నెలకొల్పింది. ఢిల్లీతో మ్యాచ్‌లో 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన RCB.. ఇంకా 81 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. తద్వారా IPL చరిత్రలో అత్యధిక బంతులు మిగిలి ఉండగా విజయం సాధించిన జట్ల జాబితాలో RCB రెండో స్థానానికి చేరింది. కాగా, ఈ జాబితాలో MI అగ్రస్థానంలో ఉంది. 2008లో KKRపై 87 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

April 28, 2026 / 05:31 PM IST

‘బాహుబలి 2’కు 9 ఏళ్లు

‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. 2017 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తూ రూ.1,800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ ఐకానిక్ మూవీ 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం SMలో ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో అభిమానులు అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

April 28, 2026 / 05:02 PM IST

IPL: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు మైదానంలోకి దిగబోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్క్, రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తదుపరి పోరులో బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్వయంగా ధృవీకరించాడు. స్టార్క్ రాకతో ఢిల్లీ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.

April 28, 2026 / 04:57 PM IST

PBKS Vs RR: హెడ్ టు హెడ్ రికార్డులు

పంజాబ్, రాజస్థాన్ మధ్య IPLలో ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో RR 17 విజయాలతో ఆధిక్యంలో ఉండగా, పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. ముల్లాన్‌పూర్ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగగా, తలో విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుత సీజన్‌లో రెండు జట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. అగ్రస్థానంలో PBKS ఉండగా, రాజస్థాన్ 4వ స్థానంలో కొనసాగుతోంది.

April 28, 2026 / 04:02 PM IST

‘నా పని అయిపోయిందని.. ఎగతాళి చేశారు’

శ్రేయస్ అయ్యర్ తను ఎదుర్కొన్న విమర్శల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా పని అయిపోయిందని, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు నా టెక్నిక్ సరిపోదని ఎగతాళి చేశారు. కానీ ఆ విమర్శలే నన్ను మరింత బలంగా పుంజుకునేలా చేశాయి. నేను ఎవరికీ సమాధానం చెప్పదలుచుకోలేదు. మాటలతో కాకుండా, నా బ్యాట్‌తోనే ప్రతి విమర్శకుడి నోరు మూయిస్తా. నా ఆట తీరే నేను ఎవరో నిరూపిస్తుంది’ అని పేర్కొన్నాడు.

April 28, 2026 / 03:42 PM IST

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: DC ఓనర్

RCB నిన్న జరిగిన మ్యాచ్‌లో DC ఎదుర్కొన్న ఘోర ఓటమిపై ఆ జట్టు సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందించారు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం నిజంగా చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ జట్టుపై నమ్మకాన్ని కోల్పోకూడదని, గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఢిల్లీ కేవలం 75 పరుగులకే కుప్పకూలగా.. RCB 6.3 ఓవర్లలోనే విజయం సాధించింది.

April 28, 2026 / 03:02 PM IST