ఐపీఎల్ చరిత్రలో RCB జట్టు అరుదైన రికార్డును నెలకొల్పింది. ఢిల్లీతో మ్యాచ్లో 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన RCB.. ఇంకా 81 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. తద్వారా IPL చరిత్రలో అత్యధిక బంతులు మిగిలి ఉండగా విజయం సాధించిన జట్ల జాబితాలో RCB రెండో స్థానానికి చేరింది. కాగా, ఈ జాబితాలో MI అగ్రస్థానంలో ఉంది. 2008లో KKRపై 87 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.