RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. 6 ఓవర్లలో 13/6 పరుగులతో.. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా ఢిల్లీ నిలిచింది. గతంలో ఈ రికార్డు 14/2 పరుగులతో రాజస్థాన్ రాయల్స్(2009, vs RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్(2022, vs RR) జట్ల పేరిట సంయుక్తంగా ఉండగా.. ఇప్పుడు ఢిల్లీ ఆ రికార్డును బ్రేక్ చేసింది.
IPL చరిత్రలో అత్యల్ప స్కోరు రికార్డు RCB పేరిట ఉంది. 2017లో KKRతో జరిగిన మ్యాచ్‌లో RCB కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ 58, 59 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉంది. అయితే, ఇప్పుడు RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో RCB పేరిట ఉన్న చెత్త రికార్డును ఢిల్లీ చెరిపేసి.. తన పేరిట లిఖించుకునేలా కనిపిస్తోంది.
RCBతో మ్యాచ్‌లో DCకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. అరంగేట్ర ఆటగాడు సాహిల్ పరాఖ్‌ను భువనేశ్వర్ తొలి ఓవర్‌లోనే డకౌట్ చేశాడు. అనంతరం హేజిల్‌వుడ్ తన ఓవర్లో వరుస బంతుల్లో.. రాహుల్ (1), సమీర్ రిజ్వీ(0)లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లో భువీ.. స్టబ్స్, అక్షర్‌ను ఔట్ చేశాడు. దీంతో DC 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.
RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. అరంగేట్ర ఆటగాడు సాహిల్ పరాఖ్‌ను భువనేశ్వర్ తొలి ఓవర్‌లోనే డకౌట్ చేశాడు. అనంతరం హేజిల్‌వుడ్ తన ఓవర్లో వరుస బంతుల్లో.. సెంచరీ హీరో KL రాహుల్ (1), సమీర్ రిజ్వీ (0)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి DC పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
భారత మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ 92 పరుగులతో అజేయంగా నిలిచింది. మిగతా బ్యాటర్లలో సునే లూస్ (23) మినహా అందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లలో క్రాంతి, శ్రీ చరణి, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీశారు.
అఫ్ఘానిస్తాన్ స్టార్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒమర్జాయ్ తల్లి ఇవాళ కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో సహచర క్రికెటర్లు అతడికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒమర్జాయ్ పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. తల్లి మరణంతో అతడు IPLను వీడి స్వదేశానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
DCతో జరగబోయే మ్యాచ్‌లో RCB స్టార్ ప్లేయర్ కోహ్లీని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లీ మరో 111 పరుగులు చేస్తే IPLలో 9000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే 66 పరుగులు సాధిస్తే టీ20ల్లో భారత గడ్డపై 10 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. మరో 3 సిక్సర్లు బాదితే, టీ20ల్లో 450 సిక్సర్ల మార్కును అందుకుంటాడు.
IPLలో DCపై RCB స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచ్‌ల్లో తలపడగా, RCB 20 విజయాలతో ముందంజలో ఉంది. DC 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇవాళ మ్యాచ్ జరగనున్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 11 మ్యాచ్‌ల్లో, RCB 7 విజయాలతో హోమ్ టీమ్ ఢిల్లీ కంటే మెరుగైన రికార్డును కలిగి ఉంది.
LSG 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో రిషభ్ పంత్‌ను ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే LSG ఓటములకు కారణమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పంత్‌ను తప్పించి మార్‌క్రమ్‌కు కెప్టెన్సీ అప్పగించాలని వారు సూచిస్తున్నారు.
GT స్టార్ రషీద్ ఖాన్ IPLలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2017లో SRH తరఫున అరంగేట్రం చేసిన ఇతడు, అప్పటి నుండి ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా వరుసగా 144 మ్యాచ్‌లు ఆడాడు. దీనితో IPL అరంగేట్రం చేసిన నాటి నుండి ఒక్క మ్యాచ్ కూడా విరామం లేకుండా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు రైనా (143) పేరిట ఉండేది.
లక్నోతో జరిగిన మ్యాచులో KKR బ్యాటర్ రింకూ సింగ్ 51 బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 6వ నంబర్ బ్యాటర్‌గా దిగిన రింకూ IPL చరిత్రలోనే ఆ పొజిషన్‌లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. CSK ప్లేయర్ MS ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. 2011 IPL సీజన్‌లో RCBతో జరిగిన మ్యాచులో ధోనీ 6వ నంబర్ బ్యాటర్‌గా దిగి 40 బంతుల్లో 70 రన్స్ చేశాడు.
LSG కెప్టెన్ రిషబ్ పంత్ జట్టు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మాకు విరామం అవసరం. ప్రతి మ్యాచులో ఒత్తిడి ఉంటుంది. మనలోని పరిష్కారాలు కనుగొనాలి. ప్రతి ఆటగాడు బాధ్యత తీసుకోవాలి. ఇది ఒకరిద్దరి ఆట కాదు’ అని వ్యాఖ్యానించాడు. సూపర్ ఓవర్‌లో పూరన్‌ను పంపిన నిర్ణయాన్ని కూడా పంత్ సమర్థించాడు. ‘అతను ఫామ్‌లో లేకపోయినా, కష్ట సమయాల్లో మన ఆటగాళ్లను నమ్మాలి’ అని తెలిపాడు.
IPL 2026లో భాగంగా LSG, కోల్‌కతా మ్యాచ్ టై అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఇరు జట్ల స్కోర్‌లు సమం కావడంతో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలనుంది.