చెన్నై వేదికగా జరిగిన పోరులో CSKపై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSKను 158 పరుగులకే కట్టడి చేసిన GT.. ఆ లక్ష్యాన్ని కేవలం 16.4 ఓవర్లలోనే ఛేదించింది. సాయి సుదర్శన్ (87) హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గిల్ (33), బట్లర్ (29) రాణించారు. ఈ విజయంతో GT పాయింట్ల పట్టికలో 7వ స్థానం నుండి 5వ స్థానానికి ఎగబాకింది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ IPLలో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. RCBతో జరిగిన గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన అతడు, ఇప్పుడు CSKతో జరుగుతున్న పోరులోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 33 బంతుల్లోనే IPLలో తన 14వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో గుజరాత్ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం 13 ఓవర్లలో స్కోర్ 118/1.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తడబడిన అదే పిచ్‌పై, గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు మాత్రం ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (32), సాయి సుదర్శన్ (23) తొలి వికెట్‌కు కేవలం 36 బంతుల్లోనే 55 పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా వేగంగా పరుగులు సాధిస్తూ చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు.
CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ GTతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే, ఈ అర్ధ సెంచరీ కోసం అతడు 49 బంతులు తీసుకున్నాడు. దీంతో ఈ సీజన్‌లోనే అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. SRHతో మ్యాచ్‌లో పంత్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, ఇప్పుడు గైక్వాడ్ ఆ రికార్డును అధిగమించాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో గైక్వాడ్ 60 బంతుల్లో 74* పరుగులు చేశాడు.
CSK స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. IPLలో బంతుల పరంగా అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా సంజూ నిలిచాడు. ఈ జాబితాలో డివిలియర్స్ (3,288 బంతులు), డేవిడ్ వార్నర్ (3,554 బంతులు) తొలి రెండు స్థానాల్లో ఉండగా, సంజూ 3,555 బంతులతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అతను సురేష్ రైనా (3,620 బంతులు) రికార్డును అధిగమించాడు.
ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ల్లో లక్నో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు తలపడిన 7 మ్యాచ్‌ల్లో LSG 5, KKR 2 గెలిచాయి. ఈ సీజన్ తొలి పోరులోనూ LSG 3 వికెట్లతో నెగ్గింది. అయితే లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరిగిన 2 మ్యాచ్‌ల్లో ఇరుజట్లు చెరో విజయం సాధించాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
RR కెప్టెన్ రియాన్ పరాగ్‌పై సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. అతడి కెప్టెన్సీ వ్యూహాలు తనకు అస్సలు అర్థం కావడం లేదని అన్నాడు. SRHతో మ్యాచ్‌లో స్టార్ స్పిన్నర్లు జడేజా, బిష్ణోయ్‌లకు ఒక్క ఓవర్ మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. స్టార్ బౌలర్లను పరాగ్ సరిగా వినియోగించుకోలేకపోతున్నాడని తెలిపాడు. అతడి కెప్టెన్సీపై RR యాజమాన్యం పునరాలోచన చేయాలని సూచించాడు
టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాస్ అభిమానులకు షాకిచ్చాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ దూరమవ్వడం టెన్నిస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. వచ్చే నెల 5 నుంచి ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రారంభం కానుంది. అల్కరాస్ గైర్హాజరీతో ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో CSK బ్యాటర్లు తీవ్రంగా తడబడుతున్నారు. 10 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులే చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో చెన్నై బ్యాటర్లకు పరుగులు తీయడం కష్టంగా మారింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 31 బంతుల్లో 19* పరుగులతో టెస్టు తరహా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి తోడుగా దూబే (6) క్రీజులో ఉన్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో CSKకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే రబాడా డబుల్ షాక్ ఇచ్చాడు. ఇన్ ఫామ్ సంజూ శాంసన్ (11), వన్ డౌన్ ప్లేయర్ ఉర్విల్ పటేల్ (4)లను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ వెంటనే సిరాజ్.. సర్ఫరాజ్ ఖాన్‌ను డకౌట్ చేశాడు. దీంతో 5 ఓవర్లలో CSK 3 వికెట్ల నష్టానికి కేవలం 26 పరుగులు మాత్రమే చేసింది.
మైదానంలో ధోనీని చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో CSK ఇప్పటికే 7 మ్యాచ్‌లు ఆడినా, మహీ ఒక్కటి కూడా ఆడలేదు. ఈరోజు GTతో మ్యాచ్‌కు కూడా ధోనీ దూరమయ్యాడు. ఒకవేళ CSK ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించకపోతే, మరో 6 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ధోనీని మైదానంలో చూస్తామా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
PBKSతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన DC బౌలర్ లుంగి ఎంగిడి, తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని పేర్కొంటూ, అభిమానులు తనపై చూపిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎంగిడి ఢిల్లీలోని LK-Max సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి, తిరిగి టీమ్ హోటల్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. జట్టును విజయపథంలో నడిపించగల సామర్థ్యం శ్రేయస్‌కు ఉందని తెలిపాడు. అందుకే వేలంలో అతని కోసం అంతగా పట్టుబట్టానని పేర్కొన్నాడు. ఒక జట్టును సున్నా నుంచి నిర్మించాలంటే శ్రేయస్ వంటి ప్రతిభావంతుడైన కెప్టెన్ అవసరమని చెప్పాడు. కాగా, వేలంలో PBKS అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.