• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

DC Vs RCB: హెడ్ టు హెడ్ రికార్డులు

IPLలో DCపై RCB స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచ్‌ల్లో తలపడగా, RCB 20 విజయాలతో ముందంజలో ఉంది. DC 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇవాళ మ్యాచ్ జరగనున్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 11 మ్యాచ్‌ల్లో, RCB 7 విజయాలతో హోమ్ టీమ్ ఢిల్లీ కంటే మెరుగైన రికార్డును కలిగి ఉంది.

April 27, 2026 / 02:50 PM IST

IPL: ‘పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలి’

LSG 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో రిషభ్ పంత్‌ను ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే LSG ఓటములకు కారణమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పంత్‌ను తప్పించి మార్‌క్రమ్‌కు కెప్టెన్సీ అప్పగించాలని వారు సూచిస్తున్నారు.

April 27, 2026 / 02:34 PM IST

IPL: చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌

GT స్టార్‌ రషీద్‌ ఖాన్‌ IPLలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2017లో SRH తరఫున అరంగేట్రం చేసిన ఇతడు, అప్పటి నుండి ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కాకుండా వరుసగా 144 మ్యాచ్‌లు ఆడాడు. దీనితో IPL అరంగేట్రం చేసిన నాటి నుండి ఒక్క మ్యాచ్‌ కూడా విరామం లేకుండా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు రైనా (143) పేరిట ఉండేది.

April 27, 2026 / 02:12 PM IST

ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రింకూ సింగ్

లక్నోతో జరిగిన మ్యాచులో KKR బ్యాటర్ రింకూ సింగ్ 51 బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 6వ నంబర్ బ్యాటర్‌గా దిగిన రింకూ IPL చరిత్రలోనే ఆ పొజిషన్‌లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. CSK ప్లేయర్ MS ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. 2011 IPL సీజన్‌లో RCBతో జరిగిన మ్యాచులో ధోనీ 6వ నంబర్ బ్యాటర్‌గా దిగి 40 బంతుల్లో 70 రన్స్ చేశాడు.

April 27, 2026 / 11:42 AM IST

ప్రతి ఒక్కరూ బాధ్యత స్వీకరించాలి: పంత్

LSG కెప్టెన్ రిషబ్ పంత్ జట్టు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మాకు విరామం అవసరం. ప్రతి మ్యాచులో ఒత్తిడి ఉంటుంది. మనలోని పరిష్కారాలు కనుగొనాలి. ప్రతి ఆటగాడు బాధ్యత తీసుకోవాలి. ఇది ఒకరిద్దరి ఆట కాదు’ అని వ్యాఖ్యానించాడు. సూపర్ ఓవర్‌లో పూరన్‌ను పంపిన నిర్ణయాన్ని కూడా పంత్ సమర్థించాడు. ‘అతను ఫామ్‌లో లేకపోయినా, కష్ట సమయాల్లో మన ఆటగాళ్లను నమ్మాలి’ అని తెలిపాడు.

April 27, 2026 / 09:46 AM IST

LSG vs KKR: మ్యాచ్ టై.. సూపర్ ఓవర్

IPL 2026లో భాగంగా LSG, కోల్‌కతా మ్యాచ్ టై అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఇరు జట్ల స్కోర్‌లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌లో ఫలితం తేలనుంది.

April 26, 2026 / 11:31 PM IST

LSG vs KKR: ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్

IPL 2026లో భాగంగా కోల్‌కతా, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో బ్యాటర్లు తడబడుతున్నారు. అనుకుల్ రాయ్ వేసిన 15.2 ఓవర్‌కు ముకుల్ చౌదరి (1) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బదోని (16*), హిమ్మత్ సింగ్ (0*) ఉన్నారు. లక్నో విజయానికి 24 బంతుల్లో 52 పరుగులు అవసరం.

April 26, 2026 / 11:03 PM IST

LSG vs KKR: రిషభ్ పంత్ ఔట్

IPL 2026లో భాగంగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. నరైన్ వేసిన 12.2 ఓవర్‌కు వికెట్‌కీపర్ సీఫర్ట్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ (42) పెవిలియన్ చేరాడు. అంతకుముందు గ్రీన్ వేసిన 10.2 ఓవర్‌కు మార్‌క్రమ్ (31) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పూరన్ (9*), బదోని (3*) ఉన్నారు. లక్నో గెలుపునకు 40 బంతుల్లో 68 పరుగులు అవసరం.

April 26, 2026 / 10:46 PM IST

LSG vs KKR: నిలకడగా ఆడుతున్న లక్నో బ్యాటర్లు

IPL 2026లో భాగంగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. మార్‌క్రమ్ (28*), పంత్ (23*) పరుగులతో క్రీజులో ఉన్నారు. లక్నో గెలుపునకు 66 బంతుల్లో 99 రన్స్ అవసరం. 

April 26, 2026 / 10:19 PM IST

రేపు భారత్ Vs సౌతాఫ్రికా చివరి టీ20

భారత్, సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య రేపు చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సౌతాఫ్రికా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకోగా, గత మ్యాచ్‌లో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి మ్యాచ్‌ను కూడా గెలిచి సౌతాఫ్రికా పర్యటనను విజయంతో ముగించాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది.

April 26, 2026 / 09:37 PM IST

రింకూ సింగ్ పోరాటం.. KKR స్కోర్ ఎంతంటే?

లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు తడబడ్డారు. దీంతో KKR.. 155/7 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగాడు. కోల్‌కతా బ్యాటర్లలో రింకూ సింగ్ (83*) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. గ్రీన్ 34 పరుగులు చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ఆఖరి ఓవర్లో రింకూ 4 వరుస సిక్సర్లతో విరుచుకుపడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

April 26, 2026 / 09:22 PM IST

IPL: రేపు ఢిల్లీ Vs బెంగళూరు

ఐపీఎల్-2026లో భాగంగా రేపు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గాయం నుంచి ఇంకా కోలుకోని RCB ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. ఈ సీజన్‌లో DCతో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని RCB పట్టుదలతో ఉంది.

April 26, 2026 / 09:12 PM IST

IPL: లక్నో బౌలర్ విశ్వరూపం

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి రహానె(10), సిఫర్ట్(0), గ్రీన్(34), పావెల్(1), అనుకుల్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. IPLలో భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు ఇవే కాగా, మొహ్సిన్ కెరీర్‌లో కూడా ఇదే బెస్ట్ స్పెల్.

April 26, 2026 / 08:44 PM IST

IPL: కష్టాల్లో KKR.. 31 పరుగులకే 4 వికెట్లు డౌన్

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడింది. మొహ్సిన్ ఖాన్ (3 వికెట్లు) నిప్పులు చెరగడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రహానె, సిఫర్ట్, పావెల్‌లను మొహ్సిన్ పెవిలియన్ పంపాడు. రఘువంశీ వివాదాస్పదంగా ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నిర్ణయంతో వెనుదిరిగాడు. ప్రస్తుతం గ్రీన్, రింకూ క్రీజులో ఉన్నారు.

April 26, 2026 / 08:16 PM IST

LSG vs KKR: తుది జట్లు ఇవే

KKR: రహానే (C), సీఫెర్ట్ (WK), గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకూ(vc), నరైన్, రమణదీప్, అనుకూల్, అరోరా, త్యాగి. IMPACT: పాండే, అలెన్, తేజస్వి, సైనీ, చక్రవర్తిLSG: మార్‌క్రమ్, మార్ష్, పంత్(C), పూరన్, బదోని, ముకుల్ చౌదరి, లిండే, షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, మొహ్సిన్ ఖాన్. IMPACT: హిమ్మత్, అక్షత్ రఘువంశీ, సమద్, అవేశ్ ఖాన్, సిద్ధార్థ్

April 26, 2026 / 07:13 PM IST