• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

CSK Vs GT: పిచ్ రిపోర్ట్

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇప్పటివరకు 94 IPL మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 53 సార్లు గెలిచాయి. సాధారణంగా చేపాక్ స్పిన్నర్లకు స్వర్గధామం, కానీ ఈ సీజన్‌‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నాయి. మూడు మ్యాచ్‌లలో రెండింటిలో 200 కంటే ఎక్కువ పరుగులు నమోదయ్యాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కు మొగ్గు చూపవచ్చు.

April 26, 2026 / 02:26 PM IST

CSK Vs GT: హెడ్ టు హెడ్ రికార్డులు

ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడగా, రెండు జట్లు చెరో నాలుగు విజయాలను సాధించాయి. అయితే, ఇవాళ మ్యాచ్ జరగనున్న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో GTతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ CSK పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

April 26, 2026 / 02:16 PM IST

IPLలో నయా రికార్డులు

* నిన్న 2 మ్యాచుల్లో కలిపి ఏకంగా 986 పరుగులు వచ్చాయి.* DCపై PBKS 265(అత్యధిక స్కోర్ ఛేజ్) పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.* అత్యధిక స్కోర్ చేసిన భారత బ్యాటర్‌గా ఢిల్లీ ఆటగాడు KL రాహుల్(152) నిలిచాడు.* SRHపై RR ప్లేయర్ వైభవ్ సెంచరీ(103) సాధించాడు. 19 ఏళ్ల వయసులోపే టీ20ల్లో 2 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. 

April 26, 2026 / 01:34 PM IST

వైభవ్‌కు ఫిదా అయిన ప్యాట్ కమిన్స్

రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. అతడు తన కొత్త ఫేవరెట్ ప్లేయర్ అని అన్నాడు. ‘వైభవ్ బంతిని చాలా బలంగా కొడతాడు. అది చూడటానికి చాలా సరదాగా ఉంటుంది. తన కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. అతడు ఆడే విధానం నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడు. నిన్న వైభవ్ 37 బంతుల్లోనే 12 సిక్సులు, 5 ఫోర్లతో 103 పరుగులు చేశాడు.

April 26, 2026 / 12:36 PM IST

వైభవ్‌ సూర్యవంశీ గాయంపై అధికారిక ప్రకటన

నిన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై RR అసిస్టెంట్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. ‘వైభవ్ హ్యామ్‌స్ట్రింగ్‌లో కొద్దిగా అసౌకర్యం అనిపించింది. అందుకు చికిత్స అందించారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. మరో 2 రోజుల్లో సాధారణ స్థితికి వస్తాడని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.

April 26, 2026 / 11:48 AM IST

కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై ఇషాన్ కిషన్ ప్రశంసలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై ఆ జట్టు బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా ఉండటం తనకు సరదాగా అనిపించిందని.. కానీ కమిన్స్ అద్భుత నాయకుడని అన్నారు. ఇకపై తాను తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పైనే దృష్టి పెడతానని తెలిపాడు. అలాగే భయపడకుండా షాట్లు ఆడాలని, పవర్ ప్లేలో మంచి ప్రారంభం ఎంతో కీలకమని వెల్లడించారు.

April 26, 2026 / 10:59 AM IST

IPL 2026: వైభవ్ సూర్యవంశీకి గాయం

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ నిన్న సన్‌రైజర్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో నడవలేని స్థితిలో డగౌట్‌కు చేరుకున్నారు. దీంతో అతను నెక్ట్స్ మ్యాచ్ ఆడటంపై అనిశ్చితి నెలకొంది. ఇవాళ వైభవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

April 26, 2026 / 06:38 AM IST

అగ్రస్థానం.. CSK సరసన హైదరాబాద్

RRపై విజయంతో SRH అరుదైన ఘనత సాధించింది. RRపై అత్యధికంగా 6 వరుస మ్యాచులు గెలిచిన జట్టుగా చెన్నై సరసన అగ్రస్థానంలో నిలిచింది. 2010-13 కాలంలో CSK ఈ ఘనత అందుకోగా.. 2023 నుంచి రాజస్థాన్‌పై SRH గెలుస్తూ వస్తోంది. అలాగే IPLలో అత్యధిక సార్లు 200+ స్కోర్ ఛేదించిన జట్టుగానూ RR-RCB(5) సరసన మూడో స్థానంలో SRH నిలిచింది. ఈ లిస్టులో పంజాబ్(11), చెన్నై(6) తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.

April 26, 2026 / 01:20 AM IST

BREAKING: ఎట్టకేలకు భారత్ విజయం

సౌతాఫ్రికా మహిళలతో 5 T20ల సిరీస్‌లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. 4వ T20లో ప్రత్యర్థిపై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత హర్మన్ సేన 185/5 స్కోర్ చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా 171/9కే పరిమితమైంది. మన బౌలర్లలో దీప్తి 5, క్రాంతి, శ్రీచరణి, కాశ్వీ, షఫాలీ తలో వికెట్ తీశారు. కాగా సౌతాఫ్రికా ఇప్పటికే తొలి 3 మ్యాచుల్లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది.

April 26, 2026 / 12:53 AM IST

IPLలో ఒకే రోజు రెండు రికార్డ్ ఛేజింగ్స్

IPL 2026: శనివారం జరిగిన 2 మ్యాచుల్లోనూ రికార్డ్ ఛేజింగ్స్ నమోదయ్యాయి. తొలుత ఢిల్లీపై పంజాబ్ 265 రన్స్ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇది IPL చరిత్రలోనే అత్యధిక ఛేదన. మరో మ్యాచులో రాజస్థాన్‌పై హైదరాబాద్ 229 రన్స్ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. IPLలో ఇది 4వ అత్యధిక ఛేజింగ్. KKRపై పంజాబ్ 262, PBKSపై SRH 246 పరుగుల ఛేదన 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

April 26, 2026 / 12:20 AM IST

BREAKING: రాజస్థాన్‌పై హైదరాబాద్ విజయం

IPL 2026: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. హైదరాబాద్ 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. SRH బ్యాటర్లలో అభిషేక్ 57, ఇషాన్ 74, NKR 36 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బ్రిజేష్ చెరో 2, ఫెరీరా ఓ వికెట్ తీశారు. అంతకుముందు రాజస్థాన్ యువ ఓపెనర్ వైభవ్(103) సెంచరీతో రాణించాడు.

April 25, 2026 / 11:27 PM IST

ముగిసిన భారత్ ఆట.. SA టార్గెట్ ఎంతంటే?

5 T20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో నాల్గో మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 43, దీప్తీశర్మ 36*, రీచా ఘోష్ 34* పరుగులతో పర్వాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎలిజ్‌మరి, కైలా చెరో 2, సెకుకునే ఓ వికెట్ తీసింది. తొలి 3 T20లూ గెలిచి ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ విజయ లక్ష్యం 186 రన్స్.

April 25, 2026 / 11:09 PM IST

పవర్ ప్లేలో SRH స్కోర్ ఎంతంటే..?

IPL 2026: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ ఓ వికెట్ కోల్పోయి 89 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో అభిషేక్(34), ఇషాన్(35) ఉండగా.. అంతకుముందు హెడ్ 6 పరుగులకే వెనుదిరిగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 228/6 స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విజయం కోసం SRH మిగిలిన 84 బంతుల్లో 140 రన్స్ చేయాల్సి ఉంది.

April 25, 2026 / 10:22 PM IST

IPL: ఒకే రోజు ఇద్దరు చేతులు మారిన ఆరెంజ్ క్యాప్

RR సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. SRHతో మ్యాచ్‌లో 103 పరుగులు చేసిన వైభవ్, ఈ సీజన్‌లో మొత్తంగా 357 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో రాహుల్(357)తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. ముందుగా ఇవాళ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాహుల్ 152* పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకోగా, కొద్ది గంటల్లోనే వైభవ్ దానిని దక్కించుకోవడం విశేషం.

April 25, 2026 / 09:44 PM IST

BREAKING: SRH టార్గెట్ ఎంతంటే?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 228/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వైభవ్ సూర్యవంశీ(103) సూపర్ సెంచరీతో అదరగొట్టగా.. ధ్రువ్ జురెల్(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫెరీరా 33 పరుగులతో పర్వాలేదనిపించాడు. SRH బౌలర్లలో మలింగ 2 వికెట్లు తీయగా.. కమ్మిన్స్, ప్రఫుల్, హుస్సేన్, నితీష్ తలో వికెట్ పడగొట్టారు.

April 25, 2026 / 09:30 PM IST