రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. అతడు తన కొత్త ఫేవరెట్ ప్లేయర్ అని అన్నాడు. ‘వైభవ్ బంతిని చాలా బలంగా కొడతాడు. అది చూడటానికి చాలా సరదాగా ఉంటుంది. తన కెరీర్ను అద్భుతంగా ప్రారంభించాడు. అతడు ఆడే విధానం నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడు. నిన్న వైభవ్ 37 బంతుల్లోనే 12 సిక్సులు, 5 ఫోర్లతో 103 పరుగులు చేశాడు.