జైపూర్ వేదికగా RR, SRH జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో SRH రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బరిలోకి దిగుతున్నాడు. కమిన్స్ రాకతో, ఇప్పటివరకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్ కేవలం బ్యాటర్‌గానే ఆడబోతున్నాడు. ఈ సీజన్‌లో SRH టాస్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
DCతో మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 18 బంతుల్లోనే(3 ఫోర్లు, 5 సిక్సర్లు) తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ప్రియాంష్ (38*) కూడా దూకుడుగా ఆడుతుండటంతో.. PBKS పవర్ ప్లేలోనే 116/0 పరుగులు చేసింది. IPLలో ఇది రెండో అత్యధిక పవర్ ప్లే స్కోరు. ముఖ్యంగా ముఖేష్ వేసిన 6 ఓవర్‌లో ప్రభుసిమ్రాన్(76*) వరుసగా 6 ఫోర్లు బాదాడు.
265 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు ప్రభుసిమ్రాన్, ప్రియాంష్ ఆర్య సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో PBKS 2.5 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. ఆకిబ్ నబీ వేసిన నాలుగో ఓవర్‌లో ఈ జోడీ 4 సిక్సర్లతో విరుచుకుపడటంతో ఆ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. కాగా, ఈ జోడీ చెరో 5 సిక్సర్లతో 10 సిక్సర్లు బాదారు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రియాంష్ ఆర్య కొట్టిన షాట్‌ను అందుకునే క్రమంలో ఎంగిడి కింద పడిపోవడంతో, అతడి తల బలంగా నేలకు తగిలింది. దీంతో అతడు నొప్పితో మైదానంలోనే విలవిలలాడాడు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో వైద్య బృందం ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.
IPL చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ 5వ స్థానానికి చేరుకున్నాడు. PBKSతో మ్యాచ్‌లో 152* పరుగులు చేయడంతో.. 5,579 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సురేష్ రైనా (5,528) రికార్డును రాహుల్ అధిగమించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో కోహ్లీ (8,989), రోహిత్ (7,183), శిఖర్ ధావన్ (6,769), డేవిడ్ వార్నర్ (6,565) తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 264/2 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2024లో ముంబై ఇండియన్స్‌పై సాధించిన 257/4 పరుగుల రికార్డును ఢిల్లీ ఈ మ్యాచ్‌తో బ్రేక్ చేసింది. అంతేకాకుండా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక టీమ్ స్కోరు కూడా ఇదే కావడం గమనార్హం.
IPL చరిత్రలో KL రాహుల్ అరుదైన రికార్డు సృష్టించాడు. PBKSతో మ్యాచ్‌లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152* పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో IPL చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అభిషేక్ శర్మ (141) పేరిట ఉండేది. ఇక ఓవరాల్‌గా IPLలో క్రిస్ గేల్ (175*), మెకల్లమ్ (158*) తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఢిల్లీ స్టార్ బ్యాటర్ KL రాహుల్ ఆరెంజ్ క్యాప్ రేస్‌లోకి దూసుకొచ్చాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 152* పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీంతో ఈ సీజన్‌లో మొత్తం స్కోరు 357 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ (328)ని వెనక్కినెట్టి రాహుల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అభిషేక్(323), క్లాసెన్ (320) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఢిల్లీ స్టార్ బ్యాటర్ KL రాహుల్ ఆరెంజ్ క్యాప్ రేస్‌లోకి దూసుకొచ్చాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 152* పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీంతో ఈ సీజన్‌లో మొత్తం స్కోరు 357 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ (328)ని వెనక్కినెట్టి రాహుల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అభిషేక్(323), క్లాసెన్ (320) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
పంజాబ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా KL రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. 152* పరుగుల భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. మరోవైపు నితీష్ రాణా తృటిలో సెంచరీని చేజార్చుకున్నప్పటికీ, 91 పరుగులతో అదరగొట్టాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 220 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో DC.. 264/2 పరుగుల భారీ స్కోరు చేసింది.
IPLలో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 22 సార్లు తలపడగా.. SRH 13, RR 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో HYD వేదికగా జరిగిన పోరులోనూ RRను SRH చిత్తు చేసింది. ఇక ఇవాళ మ్యాచ్ జరగనున్న జైపూర్ స్టేడియంలో జరిగిన 4 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో రెండు విజయాలతో సమంగా నిలిచాయి.
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో KL రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కేవలం 47 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌కు IPL కెరీర్‌లో ఇది 6వ సెంచరీ కావడం విశేషం. మరోవైపు అతడికి తోడుగా నితీష్ రాణా (72*) కూడా సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. వీరిద్దరి ధాటికి ఢిల్లీ భారీ స్కోరు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
CSK జట్టుకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా CSK జట్టును వీడినట్లు సమాచారం. అతడు మళ్లీ ఎప్పుడు జట్టుతో చేరుతాడన్న విషయంపై క్లారిటీ లేదు. దీంతో రేపు గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు రుతురాజ్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేజరిగితే, CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్ వ్యవహరించనున్నాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో KL రాహుల్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో IPLలో తన 43వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో రాహుల్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. కాగా, 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను జారవిడిచిన పంజాబ్.. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది.
PBKSతో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. 28 పరుగుల వద్ద ఓపెనర్ నిస్సంక (11) వికెట్‌ను కోల్పోయింది. అయితే, అర్షదీప్ బౌలింగ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద KL రాహుల్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శశాంక్ సింగ్ జారవిడిచాడు. ప్రస్తుతం రాహుల్ (35*), రాణా (22*) క్రీజులో ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్లలో 68/1.