• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

DC vs PBKS: దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ

PBKSతో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. 28 పరుగుల వద్ద ఓపెనర్ నిస్సంక (11) వికెట్‌ను కోల్పోయింది. అయితే, అర్షదీప్ బౌలింగ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద KL రాహుల్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శశాంక్ సింగ్ జారవిడిచాడు. ప్రస్తుతం రాహుల్ (35*), రాణా (22*) క్రీజులో ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్లలో 68/1.

April 25, 2026 / 04:06 PM IST

IPL: ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన రికార్డ్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు IPLలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచింది. గత సీజన్ చివరి రెండు మ్యాచ్‌ల్లో కూడా టాస్ గెలవడంతో, ఢిల్లీ జట్టు వరుసగా 9 మ్యాచ్‌ల్లో టాస్ విజయాలను నమోదు చేసుకుంది. గతంలో SRH (2015-16), CSK (2019) కూడా వరుసగా 9 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి ఈ రికార్డును సృష్టించాయి.

April 25, 2026 / 03:33 PM IST

DC vs PBKS: తుది జట్లు ఇవే

పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్(WK), ప్రియాంష్, కొన్నోలీ, అయ్యర్ (c), శశాంక్, స్టోయినిస్, యాన్‌సన్, బార్ట్‌లెట్, వైషాక్, అర్ష్‌దీప్, చాహల్ఢిల్లీ: నిస్సాంక, రాహుల్(WK), రిజ్వీ, అక్షర్(c), నితీష్ రాణా, స్టబ్స్, మిల్లర్, ఎంగిడి, కుల్దీప్, నటరాజన్, ముఖేష్ కుమార్

April 25, 2026 / 03:09 PM IST

DC vs PBKS: హెడ్ టు హెడ్ రికార్డ్

IPL చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు సమంగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 35 మ్యాచ్‌ల్లో తలపడగా, రెండు జట్లూ చెరో 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక ఇవాళ మ్యాచ్ జరుగుతున్న అరుణ్ జైట్లీ స్టేడియం జరిగిన 12 మ్యాచ్‌ల్లో కూడా ఇరు జట్లు చెరో 6 విజయాలతో నిలిచాయి.

April 25, 2026 / 02:53 PM IST

సంజీవ్ గొయెంకా కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

LSG ఓనర్ సంజీవ్ గొయెంకా వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా AI, డిజిటల్ మార్ఫింగ్‌ను ఉపయోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. అటువంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.

April 25, 2026 / 02:48 PM IST

సన్‌రైజర్స్‌తో పోరుకు రోహిత్ సిద్ధం..!

MI స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గాయం నుండి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 29న SRHతో జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అతడు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 ఓడిన ముంబై, ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇకపై ప్రతి మ్యాచ్‌ కచ్చితంగా గెలవాల్సిందే. రోహిత్ రాకతోనైనా ఆ జట్టు విజయాల బాట పడుతుందో లేదో చూడాలి.

April 25, 2026 / 02:18 PM IST

భారత హైకమిషనర్‌ను కలిసిన మహిళా క్రికెట్ జట్టు

మహిళల నాలుగో T20Iకి ముందు ప్రిటోరియాలోని భారత హైకమిషన్ టీమిండియా గౌరవార్థం విందు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో భారత హైకమిషనర్ శ్రీ ప్రభాత్ కుమార్‌ను జట్టు సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతకం చేసిన జెర్సీని, క్యాప్‌ను ఆయనకు బహుకరించారు. ఈ విందు క్రిడాకారుల్లో ఉత్తేజాన్ని నింపింది. 

April 25, 2026 / 10:09 AM IST

హర్భజన్‌పై శ్రీశాంత్‌ సంచలన వ్యాఖ్యలు

IPL- 2008లో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తనను కొట్టిన ఘటనపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తాజాగా స్పందించాడు. ఆ వివాదాస్పద ‘చెంపదెబ్బ’ను వాడుకుని భజ్జీ ఒక కమర్షియల్ యాడ్ ద్వారా రూ.కోటి సంపాదించాడని ఆరోపించాడు. ఒకప్పుడు పెద్ద వివాదంగా మారిన ఈ విషయాన్ని ఇప్పటికీ హర్భజన్ క్యాష్ చేసుకుంటున్నాడని, తన బాధను అతను ఆదాయంగా మార్చుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

April 25, 2026 / 09:29 AM IST

సింధు తలపై ఆ కొత్త పరికరం ఏంటి?

ఉబర్‌ కప్‌లో పీవీ సింధు ధరించిన ‘టెంపుల్‌’ అనే కొత్త వేరబుల్‌ పరికరం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ పరికరం మెదడులో రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇది క్రీడాకారుల ఏకాగ్రత, మానసిక అలసట, ఒత్తిడిని కొలుస్తూ ‘బ్రెయిన్ ఫిట్‌నెస్ ట్రాకర్‌’లా పనిచేస్తుంది.

April 25, 2026 / 08:26 AM IST

అదే మేము చేసిన తప్పిదం: కెప్టెన్

RCBతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. ‘ఇన్నింగ్స్ ముగింపు దశలో బ్యాటర్లు తడబడటం ఓటమికి ప్రధాన కారణం. ముఖ్యంగా 16వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకు ఆశించిన స్థాయిలో బౌండరీలు రాకపోవడం వల్ల జట్టు స్కోరు 220 దాటాల్సిన చోట 205 దగ్గరే ఆగిపోయింది. డెత్ ఓవర్లలో బ్యాటర్లు మరింత వేగంగా ఆడాల్సి ఉండేదని’ అని అభిప్రాయపడ్డాడు.

April 25, 2026 / 07:43 AM IST

కోహ్లీ రికార్డుల వర్షం

✦ IPLలో అత్యధిక ఫోర్లు- 807* ✦ గేల్(357), రోహిత్(310*) తర్వాత అత్యధిక సిక్సర్లు-303* ✦ టోర్నీలో 1100+ బౌండరీలు బాదిన తొలి ✦ ప్లేయర్ వార్నర్(60) తర్వాత ఓపెనర్‌గా అత్యధిక హాఫ్ సెంచరీలు-50* ✦ ఓ దేశం(భారత్)లో 10000+ T20 రన్స్ పూర్తి చేసిన ప్లేయర్ ☞ 11 రన్స్ దూరంలో 9000 IPL పరుగుల మైలురాయి.

April 25, 2026 / 06:35 AM IST

కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డ్

గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో RCB సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 రన్స్ చేశాడు. IPLలో కోహ్లీకి ఇది 20*వ POTM కాగా.. అత్యధిక సార్లు ఈ అవార్డు అందుకున్న నాల్గో ప్లేయర్‌గానూ నిలిచాడు. తన కంటే ముందు ABD(25), గేల్(22), రోహిత్(21*) తొలి 3 స్థానాల్లో కొనసాగుతున్నారు.

April 24, 2026 / 11:36 PM IST

BREAKING: గుజరాత్‌పై RCB విజయం

IPL 2026: గుజరాత్‌తో మ్యచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత GT 205/3 స్కోర్ చేయగా.. ఛేదనలో RCB తరఫున కోహ్లీ(81), పడిక్కల్(55) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో మరో 7 బాల్స్ ఉండగానే RCB విజయం అందుకుంది. అటు GT బౌలర్లలో రషీద్ 2, సుతార్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు గుజరాత్ ఓపెనర్ సుదర్శన్(100) సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

April 24, 2026 / 11:00 PM IST

ఆఖరిలో తడబడుతున్న RCB

GT విసిరిన 206 రన్స్ లక్ష్యఛేదన ఆఖరి దశలో RCB తడబడుతోంది. ఆరంభంలోనే బెథెల్ వికెట్ పడినా.. పడిక్కల్(55), కోహ్లీ(81) రెండో వికెట్‌కి 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయినప్పటికీ RCB 13-16 ఓవర్ల మధ్య ఓవర్‌కి 1 చొప్పున పడిక్కల్, కోహ్లీ, పాటీదార్(8), జితేష్(10) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం టీమ్ స్కోర్ 175/5 కాగా.. విజయం కోసం 24 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉంది.

April 24, 2026 / 10:46 PM IST

IPL: పది ఓవర్లకు RCB స్కోర్ ఎంతంటే?

గుజరాత్‌తో మ్యాచ్‌లో RCB నిలకడగా రాణిస్తోంది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు.. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి 118/1 స్కోర్ చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 49, పడిక్కల్ 52 పరుగుల వద్ద ఉండగా.. అంతకుముందు ఓపెనర్ బెథెల్(14) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు.

April 24, 2026 / 10:20 PM IST