ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు IPLలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్లో ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచింది. గత సీజన్ చివరి రెండు మ్యాచ్‌ల్లో కూడా టాస్ గెలవడంతో, ఢిల్లీ జట్టు వరుసగా 9 మ్యాచ్‌ల్లో టాస్ విజయాలను నమోదు చేసుకుంది. గతంలో SRH (2015-16), CSK (2019) కూడా వరుసగా 9 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి ఈ రికార్డును సృష్టించాయి.