MI స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గాయం నుండి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 29న SRHతో జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అతడు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 ఓడిన ముంబై, ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. రోహిత్ రాకతోనైనా ఆ జట్టు విజయాల బాట పడుతుందో లేదో చూడాలి.