• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

హాకీలో దూసుకెళ్తున్న 15 ఏళ్ల యువతి

తండ్రి కూలీ, ఇంట్లో కనీస వసతులు లేవు. ఒకప్పుడు విరిగిన హాకీ స్టిక్‌ను గుడ్డతో కట్టుకుని ఆడిన నౌషీన్ నాజ్.. ఇవాళ దేశం గర్వించేలా ఎదుగుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ 15 ఏళ్ల బాలిక, జాతీయ స్థాయిలో 9 గోల్స్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’ అవార్డు గెలుచుకుంది. పేదరికాన్ని, విమర్శలను దాటుకుంటూ జపాన్‌లో జరిగే అండర్-18 ఆసియా కప్‌కు ఎంపికయ్యే దిశగా దూసుకుపోతోంది.

April 24, 2026 / 01:27 PM IST

ఆసక్తికర పోరు.. RCBలోకి సంచలన ప్లేయర్..?

ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెథెల్ ఇవాళ RCB తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2026 సీజన్ ప్రారంభం నుంచి ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ వంటి ఓవర్సీస్ ఆటగాళ్ల మధ్య పోటీ ఉండటంతో బెథెల్‌కు ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే ఇవాళ గుజరాత్‌తో జరగనున్న మ్యాచ్‌లో షెపర్డ్ స్థానంలో బెథెల్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

April 24, 2026 / 01:00 PM IST

ఒక్కో టికెట్‌ ధర రూ.21కోట్లు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఫిఫా రీసేల్ సైట్‌లో కేవలం నాలుగు ప్రత్యేక టికెట్లు అమ్మకానికి రాగా.. వాటి ధర ఒక్కో టికెట్‌ ధర 2.3 మిలియన్‌ డాలర్లు(రూ.21 కోట్లు)గా ఉండటంతో SMలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు.. ‘ఇది టికెటా లేక విల్లా ధరనా?’ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

April 24, 2026 / 11:22 AM IST

‘కంకషన్’ దుర్వినియోగం.. వివాదంలో ముంబై

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై కంకషన్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ జరుగుతుండగా MI ప్లేయర్ శాంట్నర్ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా శార్దూల్ ఠాకుర్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే, IPL నిబంధనల ప్రకారం ఆటగాడి తల, మెడకు గాయమైనప్పుడే కంకషన్ సబ్‌స్టిట్యూట్ వర్తిస్తుందని నెట్టింట విమర్శలు వస్తున్నాయి.

April 24, 2026 / 10:27 AM IST

మళ్లీ పర్పుల్ క్యాప్ దక్కించుకున్న

నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో CSK అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అకీల్ హోసేన్ తన స్పిన్ మాయాజాలంతో 4/17 అద్భుతంగా రాణించి.. ముంబై పతనాన్ని శాసించాడు. అయితే, యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఈ మ్యాచ్ తర్వాత మొత్తం 14 వికెట్లతో మళ్లీ పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే అకీల్ హోసేన్ ఆ క్యాప్‌ను అన్షుల్ కాంబోజ్‌కు అందజేసి అభినందించాడు.

April 24, 2026 / 10:07 AM IST

సచిన్ బర్త్ డే.. BCCI స్పెషల్ విషెస్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు సందర్భంగా బీసీసీఐ స్పెషల్ విషెస్ తెలిపింది. 664అంతర్జాతీయ మ్యాచ్‌లు, 34,357 పరుగులు, 100 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ అని పేర్కొంది. టీమిండియా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2011 విజయ యాత్రలో సభ్యుడు, దిగ్గజ సచిన్ టెండూల్కర్‌కు శుభాకాంక్షలు అని ‘X’ వేదికగా రాసుకొచ్చింది.

April 24, 2026 / 09:33 AM IST

సెంచరీ కోసం కాదు.. జట్టు కోసం ఆడాను: సంజూ

ముంబైపై విజయం అనంతరం CSK స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను జట్టు కోసమే ఆడితే సెంచరీ రివార్డ్‌గా లభించిందని తెలిపాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యమని స్పష్టం చేశాడు. తనకున్న అనుభవంతో ఆటను అర్థం చేసుకున్నానని అన్నాడు. తమది యువ జట్టు.. కానీ వరుసగా మూడు ఓటముల తర్వాత తమ టీమ్ చూపించిన పోరాటం అద్భుతం అని కొనియాడాడు.

April 24, 2026 / 08:16 AM IST

మా ఓటమికి కారణమదే: పాండ్యా

చెన్నెతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలవడంపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘పవర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌లో వెనుకబడిపోయాం. CSK అద్భుతంగా బ్యాటింగ్‌తో 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. మేమే ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. మా స్పిన్నర్లు కూడా బాగానే బౌలింగ్ చేశారు. కానీ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’ అని తెలిపాడు.

April 24, 2026 / 06:52 AM IST

ముంబై ఇండియన్స్ చెత్త రికార్డులు

➤ 103 రన్స్ తేడాతో IPLలోనే ఘోర ఓటమి➤ CSKపై అత్యల్ప స్కోర్ – 104/10➤ వాంఖడేలో తొలిసారిగా 3* వరుస మ్యాచ్‌ల్లో ఓటమి➤ పవర్ ప్లేలో అత్యల్ప స్కోర్ – 29/3

April 24, 2026 / 02:30 AM IST

IPL చరిత్రలోనే ముంబైకి ఘోర ఓటమి

IPL 2026లో ముంబై పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా 4 ఓటముల తర్వాత GTపై గెలవడంతో గాడిలో పడింది అనుకున్నారు కానీ ఏం మారలేదు. ఇవాళ చెన్నై చేతిలో ఏకంగా 103 రన్స్ తేడాతో IPL చరిత్రలోనే ఘోర ఓటమిని చవిచూసింది. సూర్య(36), తిలక్(37) మినహా ఎవరూ 7+ పరుగులు చేయలేదంటేనే జట్టు ఆటతీరును అర్థం చేసుకోవచ్చు. రోహిత్ నాయకత్వంలో ఇలాంటి ప్రదర్శనను ఎప్పుడూ చూడలేదని కామెంట్ చేస్తున్నారు.

April 23, 2026 / 11:30 PM IST

IPL 2026: ముంబైపై చెన్నై ఘన విజయం

వాంఖడే మ్యాచ్‌లో ముంబైపై చెన్నై 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత చెన్నై 207/6 స్కోర్ చేయగా.. లక్ష్యఛేదనలో ముంబై 104 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బ్యాటర్లలో సూర్య(36), తిలక్(37) ఎవరూ రెండంకెల స్కోర్ అందుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అకీల్ హుసేన్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ 2, ముకేష్, గుర్జప్‌నీత్, ఓవర్టన్, కాంబోజ్ తలో వికెట్ తీశారు.

April 23, 2026 / 11:22 PM IST

MI vs CSK: పీకల్లోతు కష్టాల్లో ముంబై

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రత్యర్థి నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో బ్యాటర్లు తడబడుతుండటంతో.. 13 ఓవర్లలో 87/6 స్కోర్ మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్య(36), శార్దుల్(0) ఉండగా.. విజయం కోసం మిగిలిన 42 బంతుల్లో 121 రన్స్ చేయాల్సి ఉంది. చెన్నై బౌలర్లలో అకీల్ హుసేన్ 3, నూర్ అహ్మద్ 2, ముకేష్ ఓ వికెట్ పడగొట్టారు.

April 23, 2026 / 10:54 PM IST

MI vs CSK: పవర్ ప్లేలో ముంబై స్కోర్ ఎంతంటే?

IPL 2026: చెన్నై విసిరిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తడబడుతోంది. పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 29 పరుగులే చేసింది. ప్రస్తుతం క్రీజులో తిలక్(9), సూర్య(11) ఉన్నారు.  అంతకుముందు డీకాక్ 7 రన్స్ చేయగా.. డానిష్ మలేవార్, నమన్ ధిర్ డకౌట్ అయ్యారు. చెన్నై బౌలర్లలో అకీల్ హుసేన్ 2, ముకేష్ చౌదరి ఓ వికెట్ పడగొట్టారు.

April 23, 2026 / 10:10 PM IST

CSK vs MI: తీవ్ర కష్టాల్లో ముంబై

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కేవలం 2.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. డికాక్ 10 బంతుల్లో కేవలం 7 పరుగులు చేసి ఔట్ అవగా.. డానిష్ మాలేవార్, నమన్ ధీర్ డకౌట్‌గా వెనుదిరిగారు. CSK బౌలర్లు హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ చౌదరి ఒక వికెట్ తీశాడు. 3 ఓవర్లు పూర్తయ్యేసరికి క్రీజులో తిలక్ వర్మ(0), సూర్యకుమార్(5) ఉన్నారు.

April 23, 2026 / 09:55 PM IST

CSK vs MI: పీకల్లోతు కష్టాల్లో ముంబై

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కేవలం 2.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. డికాక్ 10 బంతుల్లో కేవలం 7 పరుగులు చేసి ఔట్ అవగా.. డానిష్ మాలేవార్, నమన్ ధీర్ డకౌట్‌గా వెనుదిరిగారు. CSK బౌలర్లు హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ చౌదరి ఒక వికెట్ తీశాడు. 3 ఓవర్లు పూర్తయ్యేసరికి క్రీజులో తిలక్ వర్మ(0), సూర్యకుమార్(5) ఉన్నారు.

April 23, 2026 / 09:55 PM IST