• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఈ అవార్డు ఆ స్పెషల్ వ్యక్తికి అంకితం: జడేజా

LSGతో జరిగిన మ్యాచ్‌లో RR ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ అవార్డును గుజరాత్ విద్యాశాఖ మంత్రి, తన భార్య రివాబాకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తాను అద్భుతాలు చేస్తానని ఆమె చెప్పినట్లు జడ్డూ వెల్లడించాడు. అలాగే, పూరన్‌ను ఔట్ చేసిన తర్వాత చేసుకున్న ‘పాకెట్’ సంబరాలు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనే అని చెప్పుకొచ్చాడు.

April 23, 2026 / 01:03 PM IST

మ్యాచ్‌కు ముందు కార్టూన్స్ చూస్తాను: వైభవ్

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పటికీ టీవీలో కార్టూన్స్‌ చూస్తానని తెలిపాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు ఇలా కార్టూన్లు చూసే అలవాటు ఉందన్నాడు. దీంతో చాలా రిలాక్స్ అవుతానని చెప్పుకొచ్చాడు. ఇలా ఆడాలి.. అలా ఆడాలని బుర్ర బద్దలు కొట్టుకోనని, మ్యాచ్‌లోకి దిగితే తన దృష్టి అంతా గేమ్ పైనే ఉంటుందని వెల్లడించాడు.

April 23, 2026 / 12:39 PM IST

కోహ్లీ టీమ్‌మేట్.. ఇప్పుడు IPLలో అంపైర్

విరాట్ కోహ్లీ సహచరుడు, 2008 అండర్-19 ప్రపంచకప్ సభ్యుడు అజితేష్ అర్గల్ అంపైర్ అవతారం ఎత్తాడు. IPL 2026లో భాగంగా LSG, RR జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో డెబ్యూ చేశాడు. ప్రపంచకప్ తర్వాత అతడిని పంజాబ్ కింగ్స్ తీసుకున్నప్పటికీ ఒక్క IPL మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా, జనవరి 22న GT, UP మధ్య జరిగిన WPL 2026లోనూ అర్గల్ అంపైర్‌గా వ్యవహరించాడు.

April 23, 2026 / 10:46 AM IST

రోహిత్‌ను క్షమించమని అడిగా: మాజీ చీఫ్ సెలక్టర్

BCCI సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ జట్టుకు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు. గతేడాది అతడిని కలిసినప్పుడు ‘నన్ను క్షమించు’ అని అడిగినట్లు పేర్కొన్నాడు. కావాలని తాము నిర్ణయం తీసుకోలేదని.. బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్లను తీసుకోవాలని భావించినట్లు వెల్లడించాడు.

April 23, 2026 / 08:53 AM IST

భారత్‌కు 3 రజతాలు, కాంస్యం 

ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో రెండో రోజు భారత్‌కు మూడు రజతాలు, ఒక కాంస్యం వరించాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ పురుషుల ఈవెంట్లో రోహిత్ కన్యన్ భారత్‌కు తొలి రజతం అందించాడు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సెజల్ కాంబ్లే రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రాజ్‌చంద్ర, అభినవ్ దేశ్వాల్ రజతం, కాంస్యం సాధించారు.

April 23, 2026 / 06:37 AM IST

BREAKING: చిత్తుగా ఓడిన భారత్

సౌతాఫ్రికా మహిళలతో మూడో T20లోనూ భారత్ చిత్తుగా ఓడింది. 193 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ లారా(115), లూస్(56*) రాణించడంతో.. 5 T20ల సిరీస్‌లో భారత్‌పై ప్రొటీస్ వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో మరో 2 మ్యాచ్‌లు ఉండగానే సిరీస్ సౌతాఫ్రికా సొంతమైంది. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్ వేసిన షెఫాలీ(9 రన్స్) మినహా తమ బౌలర్లందరూ 30కి పైగా పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

April 23, 2026 / 12:57 AM IST

IND vs SA: చెమటోడుస్తున్న హర్మన్ సేన

సిరీస్ డిసైడర్ మూడో T20లో సౌతాఫ్రికా వికెట్లు పడగొట్టేందుకు భారత మహిళా జట్టు చెమటోడుస్తుంది. ప్రొటీస్ కెప్టెన్ లారా 76*, లూస్ 39* ధాటిగా ఆడుతుండటంతో.. ఒక్క వికెట్ అయినా పడదా? అన్నట్లుగా తన అమ్మాయిలు ప్రయత్నిస్తున్నారు. 11 ఓవర్ల ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 128 కాగా.. విజయం కోసం 54 బంతుల్లో 66 రన్స్  చేయాలి. ఇందులోనూ ఓడితే సిరీస్ భారత్ చేజారుతుంది.

April 23, 2026 / 12:32 AM IST

ముగిసిన భారత్ ఆట.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న మూడో T20లో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. స్మృతి 37, షెఫాలీ 64, కెప్టెన్ కౌర్ 66 పరుగులతో రాణించడంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 రన్స్ చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో మ్లాబా 2, డిక్లెర్క్ ఓ వికెట్ తీశారు. SA విజయ లక్ష్యం 193. కాగా ఇప్పటికే తొలి 2 T20లూ ఓడిన భారత్.. ఇందులో గెలవకుంటే 5 మ్యాచ్‌ల సిరీస్ చేజారుతుంది.

April 22, 2026 / 11:35 PM IST

BREAKING: చిత్తుగా ఓడిన లక్నో

IPL 2026: రాజస్థాన్ చేతిలో లక్నో తమ సొంత మైదానంలోనే చిత్తుగా ఓడింది. RR విసిరిన 160 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్(55) అర్థసెంచరీతో రాణించగా.. పూరన్(22), హిమ్మత్ సింగ్(15) మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 3, బర్గర్, బ్రిజేష్ శర్మ చెరో 2, జడేజా, బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.

April 22, 2026 / 11:17 PM IST

LSG vs RR: పీకల్లోతు కష్టాల్లో లక్నో

IPL 2026: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో లక్నో పీకల్లోతు కష్టాల్లో పడింది. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటర్లు తడబడటంతో 114 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ యాదవ్(1), దిశ్వేష్(1) ఉండగా.. విజయం కోసం 18 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి ఉంది. రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్, బర్గర్ చెరో 2.. జడేజా, బిష్ణోయ్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.

April 22, 2026 / 11:08 PM IST

టెస్ట్ క్రికెట్‌కు రషీద్ ఖాన్ గుడ్ బై?

అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వేధిస్తున్న వెన్నునొప్పి, వైద్యుల సలహా మేరకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వైట్ బాల్ ఫార్మాట్లలో (ODI, T20) మాత్రం రషీద్ కొనసాగనున్నాడు. ఈ వార్త అఫ్గాన్ క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

April 22, 2026 / 09:53 PM IST

ఆయుష్ మాత్రే స్థానంలో ధోనీ?

‘గాయంతో దూరమైన ఆయుష్ మాత్రే స్థానంలో ధోనీని బరిలోకి దింపితే ఎలా ఉంటుంది?’ అని మాజీ క్రికెటర్ బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కీపింగ్ బాధ్యతలు చేపడితే, సంజూ శామ్సన్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వాడుకోవచ్చని సూచించాడు. రేపు ముంబైతో కీలక పోరుకు ముందు బద్రీనాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

April 22, 2026 / 09:35 PM IST

BREAKING: లక్నో ముందు స్వల్ప లక్ష్యం

లక్నో బౌలర్ల ధాటికి రాజస్థాన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లలో RR 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు జైస్వాల్ (22), సూర్యవంశీ (8) విఫలం కాగా, జురెల్ డకౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పరాగ్ (20), హెట్మెయిర్(22), జడేజా(43*) ఫర్వాలేదనిపించినా భారీ స్కోరు సాధించలేకపోయారు. LSG బౌలర్లలో షమీ, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.

April 22, 2026 / 09:21 PM IST

MI vs CSK: రేపు ఛాంపియన్ల మధ్య సమరం

IPLలో భాగంగా ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన MI, CSK జట్ల మధ్య రేపు హైవోల్టేజ్ పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. వరుస ఓటములకు గత మ్యాచ్‌తో చెక్ పెట్టిన ముంబై.. హోంగ్రౌండ్‌లో చెన్నైపై విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు రేపటి మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.

April 22, 2026 / 08:48 PM IST

షమీ మెరుపులు.. కష్టాల్లో రాజస్థాన్

LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో RR జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్‌(12)ను ఔట్ చేసిన షమీ, ఆ తర్వాతి బంతికే జురెల్‌ను కూడా పెవిలియన్ చేర్చి డబుల్ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో సూర్యవంశీ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో RR 4 ఓవర్లలో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

April 22, 2026 / 08:03 PM IST