• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఆరో స్థానంలో షఫాలీ వర్మ

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన చేస్తుంది. సఫారీ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్న షఫాలీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి… ఆరో ర్యాంక్‌కు చేరింది. కాగా, డర్బన్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో షఫాలీ 38 బంతుల్లోనే 57 పరుగులు చేయడంతో ఈ ఫీట్ సాధించింది.

April 22, 2026 / 07:56 AM IST

BREAKING: ఢిల్లీపై హైదరాబాద్ విజయం

IPL 2026: ఉప్పల్ మ్యాచ్‌లో ఢిల్లీపై హైదరాబాద్ 40 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత SRH 242/2 స్కోర్ చేయగా.. లక్ష్యఛేదనలో ఢిల్లీ 195/9కే పరిమితమైంది. DC బ్యాటర్లలో KL రాహుల్(37), నితీష్ రాణా(57), సమీర్ రిజ్వీ(41) రాణించారు. అటు SRH బౌలర్లలో ఈషన్ మలింగ 4, హర్ష్ దూబే 3, సాకిబ్ హుసేన్, మధుషంక చెరో వికెట్ పడగొట్టారు. సొంత మైదానంలో SRHకు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం.

April 21, 2026 / 11:26 PM IST

అభిషేక్ సెంచరీపై స్పందించిన యువీ

IPL 2026: ఢిల్లీతో మ్యాచ్‌లో తన శిష్యుడు, SRH ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ చేయడంపై మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘బ్యాట్‌నే పని చేయనివ్వండి. రోజురోజుకీ మెరుగుపడుతూ.. బాగా ఆడారు అభిషేక్ సార్. ఇలాగే కొనసాగించండి’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో అభిషేక్ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 135 రన్స్ చేశాడు. IPLలో అతనికిది రెండో సెంచరీ.

April 21, 2026 / 11:00 PM IST

10 ఓవర్లు పూర్తి.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే?

IPL 2026: ఉప్పల్ మ్యాచ్‌లో హైదరాబాద్ విసిరిన 243 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ పోరాడుతోంది. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 107 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో నితీష్ రాణా(57), సమీర్ రిజ్వీ(0).. అంతకుముందు నిస్సాంక 8, KL రాహుల్ 37 పరుగులు చేసి వెనుదిరిగారు. విజయం కోసం ఢిల్లీ 60 బంతుల్లో 136 రన్స్ చేయాల్సి ఉంది.

April 21, 2026 / 10:30 PM IST

IPL: రేపు LSG vs RR

రేపు లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో 6 మ్యాచ్‌లు ఆడగా.. RR 4 విజయాలతో 3వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, LSG 2 విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ పోరును హాట్‌స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వీక్షించవచ్చు.

April 21, 2026 / 09:45 PM IST

IPL: టాప్-5 అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

➣క్రిస్ గేల్ (RCB) – 175* (vs PWI) – 2013➣మెకల్లమ్ (KKR) – 158* (vs RCB) – 2008➣అభిషేక్ శర్మ (SRH) – 141 (vs PBKS) – 2025➣క్వింటన్ డికాక్ (LSG) – 140* (vs KKR) – 2022➣అభిషేక్ శర్మ (SRH) – 135* (vs DC) – 2026*

April 21, 2026 / 09:29 PM IST

కోహ్లీ రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (9) సరసన అభిషేక్ అగ్రస్థానంలో నిలిచాడు. అభిషేక్.. IPLలో 2, అంతర్జాతీయ టీ20ల్లో 2, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 5 సెంచరీలు బాది ఈ మైలురాయిని చేరుకున్నాడు.

April 21, 2026 / 08:57 PM IST

SRH vs DC: భారీ స్కోర్ దిశగా సన్‌రైజర్స్

ఉప్పల్ వేదికగా ఢిల్లీతో మ్యాచ్‌లో SRH భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. అభిషేక్, హెడ్ కలిసి తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హెడ్ (37) ఔటైన అనంతరం, కిషన్‌తో కలిసి అభిషేక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ (79*), సెంచరీ వైపు సాగుతున్నాడు. ప్రస్తుతం SRH 12.3 ఓవర్లలో 143/1 స్కోరుతో ఉంది.

April 21, 2026 / 08:34 PM IST

IPL: DC తరఫున సెంచరీ కొట్టిన అక్షర్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ IPLలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. SRHతో మ్యాచ్‌లో అక్షర్ బరిలోకి దిగడం ద్వారా.. DC తరఫున 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో పంత్ (111), అమిత్ మిశ్రా (103) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌తో ఢిల్లీ వరుసగా ఎనిమిది టాస్‌లు గెలిచింది.

April 21, 2026 / 07:34 PM IST

SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ చెత్త రికార్డు

2026 IPL సీజన్‌లో SRH జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతడు వరుసగా 7 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాడు. దీంతో SRH కెప్టెన్‌గా అత్యధిక సార్లు వరుసగా టాస్ ఓడిన డేవిడ్ వార్నర్ (6 సార్లు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (5 సార్లు) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

April 21, 2026 / 07:22 PM IST

SRH vs DC: తుది జట్లు ఇవే

DC: నిస్సాంక, KL రాహుల్(w), సమీర్ రిజ్వీ, అక్షర్(c), మిల్లర్, స్టబ్స్, రాణా, ఎంగిడి, కుల్దీప్, నటరాజన్, ముఖేష్. IMPACT: అశుతోష్, కరుణ్, చమీర, ఆకిబ్, త్రిపురాన విజయ్SRH: అభిషేక్, హెడ్, ఇషాన్(c), క్లాసెన్ (w), అరోరా, అనికేత్, నితీష్, శివంగ్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, మలింగ. IMPACT: రవిచంద్రన్, హింగే, లివింగ్‌స్టోన్, మధుశంక, హర్షల్

April 21, 2026 / 07:08 PM IST

IPL 2026: CSKకు బిగ్ షాక్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ సంచలనం ఆయుష్ మాత్రే గాయం కారణంగా ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. SRHతో పోరులో గాయపడిన అతడిని పరీక్షించిన వైద్యులు, కోలుకోవడానికి 6 నుంచి 12 వారాల సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, మాత్రే త్వరగా కోలుకొని మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ CSK సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

April 21, 2026 / 04:37 PM IST

అయ్యర్‌కు జహీర్ కీలక సూచనలు

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు. బ్యాటింగ్‌లో రాణిస్తూ టీ20 జట్టులోకి పునరాగమనం చేయడంపై దృష్టి సారించాలని పేర్కొన్నాడు. భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్సీ రేసులో అయ్యర్ బలమైన పోటీదారుడిగా నిలుస్తాడని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అతడు తన ఫామ్‌ను నిరూపించుకుంటే తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.

April 21, 2026 / 04:19 PM IST

IPL: పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డ్

➢ అన్షుల్ కాంబోజ్(CSK) – 13w (6 మ్యాచ్‌లు)➢ ప్రసిద్ధ్(GT) – 12w (6 మ్యాచ్‌లు)➢ ప్రిన్స్ యాదవ్(LSG) – 11w (6 మ్యాచ్‌లు)➢ భువనేశ్వర్(RCB) – 10w (6 మ్యాచ్‌లు)➢ రవి బిష్ణోయ్(RR) – 10w (6 మ్యాచ్‌లు)➢ రబడా(GT) – 10w (6 మ్యాచ్‌లు)➢ కృనాల్ పాండ్యా(RCB) – 8w (6 మ్యాచ్‌లు)

April 21, 2026 / 03:57 PM IST

‘BCCI ఆదేశాలను HCA పాటించడం లేదు’

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. TCAతో కలిసి పనిచేయాలని BCCI గతంలో ఆదేశించినప్పటికీ, HCA ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతేకాకుండా, TG20 లీగ్‌ను నిర్వహించడానికి హెచ్‌సీఏకు ఎటువంటి అనుమతి లేదని గురువారెడ్డి స్పష్టం చేశారు.

April 21, 2026 / 03:50 PM IST