పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు. బ్యాటింగ్‌లో రాణిస్తూ టీ20 జట్టులోకి పునరాగమనం చేయడంపై దృష్టి సారించాలని పేర్కొన్నాడు. భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్సీ రేసులో అయ్యర్ బలమైన పోటీదారుడిగా నిలుస్తాడని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అతడు తన ఫామ్‌ను నిరూపించుకుంటే తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.