అభిషేక్ శర్మ ఫామ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.’అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన చెందుతున్న వారిని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. నిజానికి మీరు అతని గురించి కాదు, రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోబోయే ప్రత్యర్థి జట్ల గురించి ఆందోళన చెందాలి’ అని సూర్య తెలిపాడు. గతేడాది అభిషేక్ జట్టు కోసం చాలా చేశాడని, ఇప్పుడు అతనికి అండగా నిలివాల్సిన బాధ్యత తమపై ఉందన్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 176/6 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(82), జెమీమా రోడ్రిగ్స్(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 2 వికెట్లు పడగొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
సూపర్-8లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ‘ఆక్యూవెదర్’ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఈరోజు రాత్రి 80 నుండి 100 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే, ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే రెండు జట్ల సెమీస్ అవకాశాలు దెబ్బతింటాయి.
అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించేలా ఉండటంతో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లతో భారత్ బరిలోకి దిగనుంది. అలాగే, ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించే వీలుంది.
T20 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కళ్లు చెదిరే రికార్డును నెలకొల్పింది. జియోస్టార్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కేవలం ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లోనే ఏకంగా 163 మిలియన్ల (16.3 కోట్లు) వ్యూస్ నమోదయ్యాయి. ఇది 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కంటే కూడా అత్యధికం. దీంతో ఈ మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పాండ్యా కొట్టిన బంతి.. సిరాజ్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో అతడికి చికిత్సను అందించాడు. అనంతరం సిరాజ్ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే, సిరాజ్ గాయం తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
సూపర్-8 పోరులో రేపు భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ కాన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత్ జట్టుపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఈ ఒత్తిడితోనే భారత్ ఓడిపోయే అవకాశం ఉందన్నాడు. కాగా, రెండు జట్లు బలంగా ఉండటంలో రేపటి మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 350* అంతర్జాతీయ మ్యాచులాడిన తొలి ఆసీస్ ప్లేయర్‌గా అవతరించింది. మొత్తంగా హర్మన్(357*), సూజీ బేట్స్(355) తర్వాత 3వ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. కాగా ఆసీస్ తరఫున 15 టెస్టులు, 165 వన్డేలు, 170 T20లు ఆడిన పెర్రీ మొత్తం 7,634 రన్స్, 331 వికెట్లు తీసింది. ఇందులో 5 సెంచరీలు, 41 అర్ధ సెంచరీలూ ఉన్నాయి.
భారత్‌తో T20 WC మ్యాచ్ సమయంలో శ్రీలంక పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని పాక్ స్పిన్నర్ ఉస్మార్ తారిక్ ఆరోపించాడు. మ్యాచ్ వేళ టీమిండియా ప్లేయర్ల బ్యాగులను పోలీసులు కనీసం పట్టుకోలేదు కానీ తమతోపాటు టీమ్ స్టాఫ్ బ్యాగులను ఒకటికి 2 సార్లు చెక్ చేశారని అసహనం వ్యక్తంచేశాడు. తమపై ఇంతటి వివక్ష ఎందుకంటూ సీరియస్ అయ్యాడు. అతని ఆరోపణల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా అమ్మాయిలతో మూడో T20లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 3 T20ల సిరీస్‌లో ఇప్పటికే ఇరుజట్లు చెరొకటి గెలవగా.. ఇందులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని హర్మన్ సేన భావిస్తోంది.
T20 WC: సూపర్-8లో భాగంగా రేపు భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఇందులో అన్న ఆల్బీ మోర్కెల్(SAస్పెషలిస్ట్ కన్సల్టెంట్), తమ్ముడు మోర్నే మోర్కెల్(IND బౌలింగ్ కోచ్) కూడా కోచ్‌గా తలపడనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కలిసి ఆడిన బ్రదర్ జోడీలు ఎన్నో ఉన్నా కోచ్‌లుగా ప్రత్యర్థి స్థానంలో తలపడటం దాదాపు ఇదే తొలిసారి. మరి ఈ అన్నదమ్ముల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
T20 WCలో ఇవాళ న్యూజిలాండ్-పాక్ మధ్య తొలి సూపర్-8 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. గత రికార్డుల ప్రకారం ఇరుజట్ల మధ్య పోరు పోటాపోటీగానే( 49 మ్యాచుల్లో 23-24) ఉండనుంది. అయితే గత సిరీస్(2015 మార్చ్)లో PAKను కివీస్ 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది. మరి ఒకే మైదానం(కొలంబో)లో ఆడుతున్న PAK ఇవాళ NZపై రాణిస్తుందో లేక గత సరీస్ మాదిరే కివీస్ ముందు చతికిలపడుతుందో చూడాలి.
పెద్దగా అంచనాల్లేకుండా T20 WCలో అడుగుపెట్టిన జింబాబ్వేను సూపర్-8కు చేర్చడంలో బ్లెసింగ్ ముజర్బానీది కీలక పాత్ర. ముఖ్యంగా 4/7 ప్రదర్శనతో కంగారూలు ఇంటి బాట పట్టేలా చేశాడు. ఈ నేపథ్యంలో T20 WC తర్వాత IPL వేలం జరిగితే అతను రూ.20 కోట్లకు పైగానే ధర పలికేవాడని భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. బంతి కొత్త, పాత అని లేకుండా మంచిగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు.