IPL 2026లో ఇవాళ ఉప్పల్ వేదికగా హైదరాబాద్, ఢిల్లీ ఢీకొంటున్న సంగతి తెలిసిందే. గణాంకాల ప్రకారం మైదానంలో ఇరుజట్లు పోటాపోటీగా ఆడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన 26 మ్యాచ్ల్లో ఢిల్లీ 12, హైదరాబాద్ 13 గెలిచాయి. మరో మ్యాచ్ రద్దు అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్లో SRHను ఓడించి లెక్క సమం చేయాలని ఢిల్లీ.. సొంత మైదానంలో హ్యాట్రిక్ నమోదు చేయాలని హైదరాబాద్ భావిస్తున్నాయి.