అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న ముంబై, ఈ మ్యాచ్‌తోనైనా విజయాల బాట పట్టాలని భావిస్తోంది. వరుసగా మూడు విజయాలతో జోష్‌లో ఉన్న గుజరాత్, తమ సొంత మైదానంలో మరో విజయంపై కన్నేసింది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ కొత్త అవతారమెత్తాడు. ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో గ్లాస్గో ముగాఫియాన్స్ జట్టుకు సహ యజమానిగా మారాడు. భారత వ్యాపారవేత్త తన్షా బాత్రాతో కలిసి ఈ స్కాట్లాండ్ ఫ్రాంచైజీని అతడు కొనుగోలు చేశాడు. కేవలం యజమానిగానే కాకుండా, ఈ జట్టుకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గానూ ‘యూనివర్సల్ బాస్’ వ్యవహరించనున్నాడు.
గుజరాత్‌తో మ్యాచ్‌లో MI జట్టులో మార్పులు చేయాలని అశ్విన్ సూచించాడు. ఈ మ్యాచ్ కోసం శాంట్నర్, ఘజన్‌ఫర్‌లను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అలాగే, అశ్వని కుమార్‌ను కూడా ఆడించాలని తెలిపాడు. మరోవైపు, GT జట్టు గ్లెన్ ఫిలిప్స్‌ను తప్పించి హోల్డర్‌ను బరిలోకి దించాలని పేర్కొన్నాడు. దీంతో ఇరు జట్ల విజయావకాశాలు మెరుగుపడతాయని వ్యాఖ్యానించాడు.
ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య హెడ్ హెడ్ రికార్డులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. గుజరాత్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఆధిపత్యం ప్రదర్శించగా, ముంబై 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ముఖ్యంగా, ఈరోజు మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ స్టేడియంలో ఈ జట్లు తలపడిన 4 మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ గెలవడం విశేషం.
TG: ఉప్పల్ స్టేడియంలో ఓ వ్యక్తి నిమ్మకాయతో మంత్రం వేస్తున్నట్లు చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వ్యక్తి స్పందిస్తూ.. తనకు వాంతులు అవుతున్నట్లు అనిపించడంతో పోలీసులను రిక్వెస్ట్ చేసి నిమ్మకాయను తీసుకెళ్లానని తెలిపాడు. అయితే, కేవలం సరదా కోసమే ఆ వీడియో చేసినట్లు వివరించాడు. దీని వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ ఓటమి అనేదే లేకుండా దూసుకుపోతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 11 పాయింట్లతో టాపర్‌గా కొనసాగుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న పంజాబ్, ఇదే జోరును కొనసాగిస్తే తొలి IPL టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
టీమిండియాలో చోటు కోసం యువ ఆటగాళ్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టులో పోటీ ఎక్కువగా ఉండటంతో, వారికి అవకాశం కల్పించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే సమయంలో రెండు వేర్వేరు దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఇందుకోసం రెండు టీ20 జట్లను సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం.
ముంబై వరుస ఓటములను చవిచూస్తుండటంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సీజన్‌లో కేవలం తొలి మ్యాచ్‌లోనే గెలిచిన ముంబై, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, MI తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఇవాళ గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఓడిపోతే, పాండ్యాపై విమర్శల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.
IPL 2026లో భాగంగా RRపై జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా ఎట్టకేలకు బోణీ కొట్టింది. దీంతో ఆ జట్టు సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. డ్రెస్సింగ్ రూమ్‌లో దాదాపు ప్రతిఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. తాము పదేళ్ల తర్వాత 2024లో మూడోసారి ఛాంపియన్‌గా నిలిచామని.. అప్పుడు కూడా ఇలాంటి దృశ్యాలను చూడలేదని చెప్పుకొచ్చాడు.
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా తనకు పౌరసత్వం ఇస్తామని ఆఫర్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే, తాను మాత్రం అఫ్గాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని మరోసారి స్పష్టం చేశాడు. IPL 2023 సీజన్ సమయంలో భారత క్రికెట్ బోర్డుకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తనకు ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చారని తెలిపాడు.
IPL 2026లో భాగంగా PBKSతో జరిగిన మ్యాచ్‌లో LSG ఓపెనింగ్ జోడీ మార్పుపై కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణమేమి లేదని తెలిపాడు. ‘ఆయుష్ బదోనిని ఈసారి ఓపెనర్‌గా పంపించాం. స్వేచ్ఛగా ఆడేందుకు అతడికి అవకాశం ఇచ్చాం. అతడితో ఓపెనింగ్ చేయించాలని ముందే నిర్ణయించాం. టాప్ ఆర్డర్‌లో మరింత స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశమే అందుకు కారణం’ అని వెల్లడించాడు.
IPL 2026లో భాగంగా LSGతో జరిగిన మ్యాచులో పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య (93), కనోలీ (87) చెలరేగారు. దీనిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. అలా ఆడాలంటే చాలా ధైర్యం కావాలని తెలిపాడు. కనోలీ, ప్రియాంశ్‌తోపాటు ఇతర బ్యాటర్లకూ ఓ మాట ఇచ్చినట్లు చెప్పాడు. ఈ IPLలో ఎవరైతే ఎక్కువ సిక్స్‌లు కొడతారో వారికి తన బ్యాట్‌ను బహుమతిగా ఇస్తానని ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
IPL 2026లో ఏడు మ్యాచ్‌లు ఆడి ఒక్కటే గెలిచిన కోల్‌కతాకు కాస్త ఊరట లభించింది. పిక్క కండరాల గాయం నుంచి కోలుకున్న శ్రీలంక పేసర్ మతీష పతిరన ఎట్టకేలకు జట్టుతో కలిశాడు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ ధ్రువీకరించింది. అయితే, కొన్ని సెషన్‌ల పాటు పతిరన మ్యాచ్ ఫిట్‌నెస్‌ను అంచనా వేసిన తర్వాతే అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయనున్నారు.
IPL 2026: కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరో రికార్డ్ అందుకున్నాడు. అర్ష్‌దీప్(151M) తర్వాత వేగంగా 155 మ్యాచుల్లోనే 200+ T20 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. అతని తర్వాత కుల్దీప్(160M), జయదేవ్ ఉనాద్కట్(162), షమీ(165) ఉన్నారు. మొత్తంగా 200+ వికెట్లు పడగొట్టిన 20 బౌలర్, 10వ స్పిన్నర్‌గానూ నిలిచాడు.
IPL 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉంటోంది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈరోజు GTతో జరిగే మ్యాచ్ ముంబైకి కీలకంగా మారింది. ‘కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు’ అని ఇటీవల హార్దిక్ చెప్పాడు. బుమ్రా ఈ సీజన్లో ఒక్క వికెట్టూ తీయలేదు. సూర్యకుమార్, తిలక్ పూర్తిగా తేలిపోతున్నారు. దీంతో GTని ఓడించాలంటే ముంబై బలంగా పుంజుకోవాల్సిందే.