జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితో సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాకు కీలక సూచనలు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్నాడు. అలాగే, అక్షర్‌ను జట్టులోకి తీసుకోవాలని కోరాడు. జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే సరిపోతుందని తెలిపాడు.
ICC ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 14న పాకిస్తాన్‌తో తలపడనుంది. 17న నెదర్లాండ్స్‌తో, 21న సౌతాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. జూలై 5న లార్డ్స్ వేదికగా ఫైనల్ జరగనుంది.
బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు తొలి వన్డే మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమ్ఇండియా మొదట బ్యాటింగ్ చేసి.. 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 215.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచులో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత్ నెట్ రన్ రేట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో భారత్ తర్వాతి రెండు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాలి. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా విజయం సాధించాలి. అప్పుడు రన్ రేటుతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే.. నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.
బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్లు మొదటి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వరల్డ్ కప్ విజయం తర్వాత హర్మన్ సేన తొలి వన్డే సిరీస్ ఆడుతోంది. 1983/84 మొదలు ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 11 వన్డే సిరీస్‌లు జరగ్గా.. భారత్ ఒక్కటి కూడా గెలవలేదు.
ఎనిమిదిసార్లు ఛాంపియన్ కర్ణాటక.. తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ రంజీ ఫైనల్‌లో తలపడనున్నాయి. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, పడిక్కల్, స్మరణ్ లాంటి బ్యాటర్లతో కర్ణాటక బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఆధ్వర్యంలోని బౌలింగ్ విభాగం వారికి ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరం. J&K తొలిసారి ట్రోఫీని ముద్దాడుతుందా లేదా చూడాలి.
టీ20 వరల్డ్‌కప్-2026లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్‌తో గెలిస్తే పాక్ మొదటి స్థానానికి వెళ్తుంది. ఓడితే, పాయింట్ల పట్టికలో మరింత దిగజారుతుంది. అప్పుడు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ బరిలో ఉంటాయి. అందుకే ఇవాళ్టి మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకంగా మారింది. కాస్త అజాగ్రత్తగా ఆడినా.. మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లిపోతుంది.
విండీస్‌తో T20 WC సూపర్ 8 మ్యాచులో జింబాబ్వే 107 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్లు 254/6 స్కోర్ చేయగా.. లక్ష్యచేధనలో జింబాబ్వే 147 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో గూడకేష్ 4, అకీల్ 3, ఫోర్ట్ 2 వికెట్లు పడగొట్టారు. అనూహ్యంగా సూపర్-8కు చేరిన జింబాబ్వేకి ప్రస్తుత టోర్నీలో ఇదే తొలి ఓటమి. మరోవైపు కరేబియన్ల జైత్రయాత్ర కొనసాగుతోంది.
జింబాబ్వేపై హెట్మేయర్ 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు బాదాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత WCలో మొత్తంగా 17 సిక్సర్లు కొట్టాడు. దీంతో సింగిల్ T20 WC ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో పూరన్(17)తో కలిసి హెట్మేయర్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, ఈ మెగాటోర్నీ పూర్తయ్యేలోపు అతడు ఈ రికార్డును మరింతగా మెరుగుపరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
జింబాబ్వేతో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. 20 ఓవర్లలో ఏకంగా 254/6 పరుగులు బాదారు. దీంతో 2026-T20 WC చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. అలాగే, T20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా రికార్డు నమోదు చేసింది. 260/6 పరుగులతో శ్రీలంక (vs కెన్యా, 2007) తొలి స్థానంలో కొనసాగుతోంది.
జింబాబ్వేతో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు దుమ్మురేపారు. హెట్మేయర్(85) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా, పావెల్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు. రూథర్‌ఫోర్డ్(31), షెపర్డ్(21) కూడా దంచికొట్టడంతో విండీస్ 254/6 పరుగుల భారీ స్కోరు చేసింది. హెట్మేయర్ రెండు క్యాచ్‌లను మిస్ చేసి జింబాబ్వే భారీ మూల్యం చెల్లించుకుంది. ముజారబానీ, రిచర్డ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
సూపర్-8 గ్రూప్-2లో భాగంగా పల్లెకెలె వేదికగా రేపు పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్, ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే దాదాపు సెమీస్‌కు చేరుకుంటుంది. మరోవైపు, తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో పాక్ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఓడితే పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
భారత్ వేదికగా మ్యాచులు ఆడటమంటే చాలా ఇష్టమని న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ తెలిపాడు. భారత్ అభిమానులు న్యూజిలాండ్ జట్టుకు మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నాడు. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ జరిగిన సరే.. కొందరు అభిమానులు బ్లాక్ జెర్సీలు ధరించి తమకు సపోర్ట్ చేస్తారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జరుగుతున్న T20 WC కివీస్ తన తర్వాతి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.
జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ హిట్టర్ హెట్మేయర్ మెరుపులు మెరిపిస్తున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అర్థ సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ తరఫున T20 WCలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో 22 బంతుల్లో తన పేరిటే ఉన్న రికార్డును తనే బ్రేక్ చేశాడు.
ఈనెల 26న సూపర్-8 పోరులో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2022లో ఆస్ట్రేలియా వేదికగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక జింబాబ్వే జట్టు భారత గడ్డపై భారత్‌తో చివరిసారిగా 2002లో తలపడింది.