రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో పేసర్ మయాంక్ యాదవ్ భారీగా పరుగులు ఇవ్వడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై దిగ్గజ కామెంటేటర్ ఇయాన్ బిషప్ స్పందిస్తూ అతడికి మద్దతుగా నిలిచారు. ‘కేవలం ఒక్క మ్యాచ్ ఆధారంగా ఆ కుర్రాడిని నెగెటివ్‌గా జడ్జ్ చేయడం సరికాదు. అతడి వేగాన్ని, ప్రతిభను గుర్తించాలి’ అని పేర్కొన్నాడు.