ముంబైతో ఇవాళ జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడతాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడట్లేదని క్రీడా వర్గాలు వెల్లడించాయి. గాయం నుంచి కోలుకుంటున్నాడని, ఇవాళ్టి మ్యాచ్‌లో అందుబాటులో ఉండడని పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 26న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి.