ఇవాళ ముంబైతో జరగనున్న మ్యాచ్లో CSK జట్టులోకి కొత్త ప్లేయర్ రానున్నాడు. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయపడి టోర్నీ నుంచి వైదొలిగడంతో అతడి స్థానంలో ఆకాష్ మధ్వాల్కు అవకాశం వచ్చింది. ఇతడు 2023, 24 సీజన్లలో ముంబై జట్టులో ఉన్నాడు. డెత్ ఓవర్లలో కీలక బౌలర్గా రాణించాడు. కాగా, ఈ నెల 18న SRHతో జరిగిన మ్యాచ్లో ఆయుష్ మాత్రే గాయపడ్డ విషయం తెలిసిందే.