మరికాసేపట్లో ముంబై వేదికగా CSK, MI జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ధోనీ ఆడనున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. దీంతో ఎంతో కాలంగా ధోనీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే CSK కీలక ప్లేయర్ ఆయుష్ మాత్రే గాయపడగా.. అతడి స్థానంలో ధోనీ వస్తాడని ‘థలా’ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.