IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ BCCIపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. IPL-2026 షెడ్యూల్, ఆ తర్వాత భారత్ ఆడబోయే సిరీస్ల మధ్య తగినంత విరామం లేకపోవడం దారుణమని మండిపడ్డాడు. BCCI కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టిందని, ఆటగాళ్ల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నాడు. ప్లేయర్లకు వారి కుటుంబాలతో గడిపే సమయం ఇవ్వాలని.. కేవలం డబ్బు సంపాదించే యంత్రాల్లా(గాడిదల్లా) చూడటం ఆపాలన్నాడు.