రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 56 పరుగులు ఇచ్చిన మయాంక్ యాదవ్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌ను ఇయాన్ బిషప్ ఖండించారు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి కోలుకుని, మళ్లీ 150 కి.మీల వేగంతో బౌలింగ్ చేయడమే ఒక అద్భుతమని అన్నారు. ఆ కుర్రాడిపై విమర్శలు చేయడం దారుణమని, అతని కంట్రోల్ కాలక్రమేణా వస్తుందని, ప్రస్తుతం అతని ఫిట్నెస్ కోసం ప్రార్థించాలని బిషప్ పేర్కొన్నారు.