లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంలో బౌలర్ నాండ్రీ బర్గర్ కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తేలడంతో ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు బర్గర్‌కు 10 శాతం మ్యాచ్ ఫీజులో జరిమానా విధిస్తూ ఐపీఎల్ ప్రకటన జారీ చేసింది. అలాగే అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది.